చిరంజీవికి ఇప్పుడు మొత్తం ఎంతమంది మానవరాళ్లున్నారో మీకు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి… పరిచయం అక్కర్లేని టాలీవుడ్ పర్వత శిఖరం. స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక బ్రాండ్ ని సంపాదించుకున్న అత్యంత అరుదైన నటుల్లో చిరంజీవి మొదటి వరుసలో వుంటారు. ఆయన పేరు చెప్పుకొని ఆ తరువాత మరెందరో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అయ్యారు. అందులో రవితేజ ఒకరు. ఇక ఆయన కుమారుడిగా రామ్ చరణ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు గడించాడు. ఉపాసన, రామ్ చరణ్ కు వివాహమై 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులు కావడం జరిగింది. దాంతో సోషల్ మీడియా వేదికగా మెగా కుటుంబానికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

కాగా నిన్నటి రోజున తెల్లవారుజామున ఉపాసనకు పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం జరిగింది. దీంతో చిరంజీవి మరొకసారి తాతగా ప్రమోషన్ పొందారు. చిరంజీవి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజున మహాలక్ష్మి పుట్టడం చాలా సంతోషంగా ఉంది అంటూ మురిసిపోతూ ఒక ట్వీట్ కూడా చేసారు. కాగా చిరంజీవికి ఇప్పటికే నలుగురు మనవరాళ్లు ఉండగా రామ్ చరణ్ కూతురు రాకతో ఆ సంఖ్య 5కి చేరింది. చిరంజీవికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడన్న సంగతి అందరికీ తెలిసినదే. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితకు సమర, సంహిత అని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అదేవిధంగా చిన్న కూతురు శ్రీజకు నివృత్తి, నవిష్క అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

ఇలా చూస్తే చిరంజీవి ఇద్దరు కుమార్తెలకు ఇద్దరు కూతుర్లు చొప్పున మొత్తం నలుగురు మనవరాళ్లు ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ ఉపాసనకు ఆడబిడ్డ పుట్టడంతో ఆ సంఖ్య 5కి చేరింది. ఇక దీనిని దృష్టిలో పెట్టుకొని చిరంజీవి కుటుంబంలో మహాలక్ష్మిల సంఖ్య పెరిగిపోతూనే వుంది అంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో చిరు నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి మరి ఈ సినిమాతో ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి మరి.