దేవర: ఎన్టీఆర్ ని ఢీకొట్టేందుకు మాలీవుడ్ విలన్..!!

RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర.. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ 30వ చిత్రం గా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేయడం జరిగింది. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతోంది .ఇందులో ఒక మాలీవుడ్ నటుడుని దేవర సినిమా కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

నాని నటించిన దసర సినిమాలో విలన్ గా మెప్పించిన బాలీవుడ్ నటుడు షైన్ టామ్ చాకో దేవరలో ఎన్టీఆర్ తో తలబడబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా కన్ఫామ్ చేయడం జరిగింది.. ఎవరో ఆయన దేవరలో నటిస్తున్నాడు అంటూ పోస్టర్ పెట్టకా దానిని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. దీంతో అందులో ఆయన నటిస్తున్నాడనే విషయం కన్ఫామ్ అయినట్టుగా సమాచారం.. దసరా సినిమాలో షైన్ టామ్ చాకో విలనిజం అందరినీ ఆకట్టుకోవడం జరిగింది.

దీంతో నాగశౌర్య నటిస్తున్న రంగ బలి సినిమాలో కూడా విలన్ పాతని పోషించబోతున్నారు.ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో నటిస్తే టాలీవుడ్ లో మరికొన్ని అవకాశాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈయనది నెగిటివ్ షెడ్డు ఉన్న క్యారెక్టర్ లేకపోతే పాజిటివ్ క్యారెక్టర్ అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది . సైఫ్ అలీ ఖాన్ కూడా విలన్ పాత్రలో నటిస్తున్నారు.ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుపుకుంటోంది ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ నిర్మిస్తూ ఉన్నారు.