ఛీ ఛీ.. అలా చేస్తే ఆది పురుష్ టీం డబ్బులు ఇస్తారా..? ఇంతకంటే నీచం మరోకటి ఉంటుందా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్.. సినిమా గురించే చర్చలు వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ఒక్క హిట్ లేక అల్లాడుతున్న ప్రభాస్ కి మళ్ళీ పునర్ వైభవం అందించింది ఆది పురుష్ సినిమా అనే చెప్పాలి . ఈ సినిమాతో ప్రభాస్ మళ్లీ తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నారు . కాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది.

కాగా సినిమాపై ఎంత పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్న అడపదడప నెగటివ్ మార్కులు కూడా వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొందరు జనాలు ఆది పురుష్ పై నెగటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు.. నెగిటివ్గా ట్విట్స్ చేస్తున్నారు. దీంతో ఆదిపురుష్ ఎలా అయినా ఈ ట్వీట్స్ ను డిలీట్ చేయించడానికి ఎవరైతే అలా నెగిటివ్గా ట్విట్ చేశారు వాళ్ళు ఆ ట్వీట్స్ డిలీట్ చేస్తే డబ్బులు ఇస్తామంటూ చెప్పుకోస్తుందట .

ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆది పురుష్ టీం కి అలాంటి కర్మ పట్టలేదని.. నెగిటివ్గా వాగే వాళ్ళు ఎన్నైనా అలాగే వాగుతారు.. ప్రభాస్ సినిమా బాగుంది.. మేం చెబుతున్నాం ఇంతకంటే..ఏం కావాలి ఆదిపురుష్ అలా ఎప్పుడు చెప్పదని ..డబ్బుల కోసం జనాలు ఈ రేంజ్ లో కూడా చేస్తున్నారా..? అంటూ ఫైర్ అవుతున్నారు . అంతేకాదు ప్రభాస్ సినిమా కలెక్షన్స్ ని ట్రెండ్ చేస్తూ ఇంత కలెక్షన్స్ వచ్చాక నెగటివ్ టాక్ వస్తే ఏంటి పాజిటివ్ టాక్ వస్తే ఏంటి అంటూ ఏకిపారేస్తున్నారు..!!