హాట్ టాపిక్ గా కాజ‌ల్ రెమ్యున‌రేష‌న్‌.. ఆ లేడీ ఓరియెంటెడ్ మూవీకి అన్ని కోట్లు ఛార్జ్ చేస్తుందా?

ముంబాయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుని గత ఎడాది పండంటి మ‌గ బిడ్డకు జన్మనిచ్చిన కాజ‌ల్‌ అగర్వాల్.. ఇటీవలే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన సంగతి తెలిసిందే. పెళ్లై ఓ బిడ్డ‌కు తల్లి అయినా సరే కాజల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కాజ‌ల్ న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణకు జోడిగా `భగవంత్ కేసరి` అనే సినిమాలో నటిస్తోంది.

అలాగే కోలీవుడ్ లో కమల్ హాసన్ కి జోడిగా `ఇండియన్ 2` లో భాగమైంది. వీటితో పాటు రీసెంట్ గా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి కమిట్ అయింది. అదే `సత్యభామ`. అఖిల్ డేగల దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం అవురమ్‌ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నిర్మితం కానుంది. ఇందులో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది. కాజల్ బర్త్‌డే సందర్భంగా నిన్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయ‌గా.. దానికి విశేషమైన స్పందన లభించింది.

అయితే ఈ సినిమాకు కాజల్ తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్‌ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకుముందు వరకు రెండున్నర కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ పుచ్చుకున్న కాజల్.. ఈ సినిమాకు ఏకంగా రూ. 3.5 కోట్ల రేంజ్ లో ఛార్జ్ చేస్తుందట. అంతేకాదు, ఇకపై ఒప్పుకునే ప్ర‌తి సినిమాలకు ఇదే స్థాయిలో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంద‌ని వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది.