డిసప్పాయింట్ చేసిన అల్లు అర్జున్.. ఎంతో ఎక్స్‌పెక్ట్ చేస్తే తుస్సుమనిపించాడుగా..

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబో మూవీ రానుందని ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఆహా వారు కూడా ప్రకటనల మీద ప్రకటనలు చేయడం జరిగింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోయారు. కానీ అదంతా నిజం కాదని తాజాగా అర్థం అయింది. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు.

అందరూ అల్లు అర్జున్ ని ఒక షోలో చూపించబోతున్నారేమో అని ఎక్స్‌పెక్ట్ చేశారు. ఆ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌కి జోడిగా శ్రీలీలా నటించబోతుందని చెప్పడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. అసలు త్రివిక్రమ్, అల్లు అర్జున్, శ్రీలీల కాంబినేషన్ లో వచ్చేది ఒక సినిమా కాదు , సిరీస్ కాదు, కనీసం టాక్ షో కూడా కాదు. అయితే ఆహా వారు మాత్రం వీరి కాంబినేషన్ గురించి ఒక రేంజ్‌లో ప్రచారం చేశారు. దాంతో అందరికీ ఈ కాంబినేషన్ పై ఆసక్తి పెరిగింది.

చివరికి ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చేది సినిమా కాదు, సిరీస్ కాదు, అది జస్ట్ ఒక కమర్షియల్ యాడ్ అని తెలిసి అభిమానులు తమ ఆశలపై నీళ్లు జల్లుకున్నారు. ఒక కమర్షియల్ యాడ్‌కి ఇంత హడావుడి అవసరమా అంటూ ఆహాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ ఉపయోగించుకొని ఆహా చాలా హడావుడి చేసి రేటింగ్స్ పెంచుకుంటున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు. మరి ఆహా వారు ఇప్పటికైనా వారి టీఆర్పి కోసం అభిమానుల మనోభావాలతో ఆడుకోవడం మానేస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.