చిరంజీవి న‌టించిన ఆ ఫ్లాప్ సినిమా అంటే ఎన్టీఆర్ కు పిచ్చ ఇష్ట‌మ‌ట‌.. తెలుసా?

తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో మెగా, నంద‌మూరి కుటుంబాల‌కు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. అయితే ఈ రెండు కుటుంబాల మ‌ధ్య కోల్డ్ వార్ సాగుతుంద‌ని ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న మాట‌. అయితే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాత్రం మెగా ఫ్యామిలీతో క్లోజ్ గా ఉంటాడు. ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్‌. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `ఆర్ఆర్ఆర్‌` ఎంత‌టి సంచ‌ల‌న విజాయాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

చిరంజీవి కూడా ఎన్టీఆర్ పై అనేక సార్లు ప్ర‌శంస‌లు కురిపించాడు. ఇక‌పోతే చిన్న‌త‌నం నుంచి ఎక్కువగా తన తాత, బాబాయ్‌ సినిమాలు చూస్తూ పెరిగిన ఎన్టీఆర్ కు.. చిరంజీవి న‌టించిన ఓ ఫ్లాప్ మూవీ అంటే పిచ్చ ఇష్ట‌మ‌ట‌. ఇంత‌కీ ఆ సినిమా మ‌రేదో కాదు రుద్రవీణ. కె.బాలచందర్ ద‌ర్శ‌క‌త్వం వ‌మించిన ఈ చిత్రం చిరంజీవి, శోభన జంట‌గా న‌టించారు.

అంజనా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ పై నాగ‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీత ప్రధానమైన సినిమా ఇది. 1988లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్డా ప‌డింది. ఈ సినిమాలో ఎలాంటి కమర్షియల్‌ హంగులు, ఫైట్లు ఉండవు. అయితే ఎన్నో అవార్డులు అందుకుంది. చిరంజీవి కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమా అంటే ఎన్టీఆర్ కు ఎంతో ఇష్ట‌మ‌ట‌. గ‌తంలో ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ స్వ‌యంగా వెల్ల‌డించాడు. `చిరంజీవి గారు ఓ స్టార్‌ హీరో అయిండి కూడా.. రుద్రవీణ సినిమా చేయటానికి అంగీకరించారు. ఓ నటుడికి ఉండాల్సిన తృష్ణ అది. ఆయ‌న‌లోని నటుడ్ని సంతృప్తి ప‌రిచిన సినిమా రుద్రవీణ. న‌న్ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న సినిమా ఇది` అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.