పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ కమెడియన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో తమ్ముడు సినిమాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఈ సినిమా అప్పట్లో యూత్ కు బాగా ఆకట్టుకున్న సినిమా అని చెప్పవచ్చు. ఈ చిత్రంలోని కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఈ సినిమాకు సంబంధించి పలు రకాల మిమ్స్ వస్తూ ఉంటాయి. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లలో జుమాంజి పేరుతో ఒక నటుడు నటించారు.. ముఖ్యంగా ముఖం కప్పుకునేలా జుట్టుతో లావుగా ఉండే క్యారెక్టర్ ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూనే ఉంటుంది.

Thammudu - YouTube
అయితే ఈ పాత్రలో కనిపించిన నటుడు అసలు పేరు మాత్రం ఎవరికీ తెలియదు.. అతడి పేరే శివ.. ఆయన కేవలం ఆ ఒక్క సినిమాలో మాత్రమే నటించారు. ఆ తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు. అందుకు కారణం.. తమ్ముడు సినిమా దర్శకుడు పి అరుణ్ ప్రసాద్ కు శివ ఫ్రెండ్ కావడం చేత ఆ చిత్రంలో నటించినట్లు తెలుస్తోంది. ఇదే మొదటి సినిమా చివరి సినిమా ఆ తర్వాత ఏ సినిమాలో కూడా శివ నటించలేదు.

అయితే అనంతరం పై చదువుల కోసం అమెరికాకు వెళ్ళినట్టు తెలుస్తోంది. అక్కడే MS పూర్తి చేశారట ..చదువు పూర్తి అయిన తర్వాత ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది .నాలుగేళ్ల క్రితం సొంతగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కూడా మొదలుపెట్టినట్లు సమాచారం ఆ కంపెనీ దిగ్విజయంగా నడుస్తోందట ఈ విషయాలన్నీ నటుడు ఇంటర్వ్యూలో స్వయంగా తెలియజేయడం జరిగింది.. తమ్ముడు సినిమాలో జుమాంజి పాత్రలో అదరగొట్టేసిన శివ గురించి ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.