పవన్ -రేణు దేశాయ్ విడిపోవడం వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరోకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సంపాదించారని చెప్పవచ్చు. ముద్దుగా అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పిలుస్తూ ఉంటారు. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ ని అభిమానించేవారు చాలామందే ఉన్నారు.. అయితే పెళ్లిళ్ల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అతని మొదటి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటగా మారితే రెండో పెళ్లి కూడా విడాకులతో ముగించడం జరిగింది.

Renu Desai : Pawan Kalyan convinced me
ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణు దేశాయిని పవన్ కళ్యాణ్ విడాకులు ఇవ్వడం వెనుక ఒక కారణం ఉందని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. 2009లో పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్- పవన్ కళ్యాణ్ 2012లో విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే ఈ విడాకులకు అసలు కారణం ఏంటని విషయం మాత్రం ఇప్పటివరకు తెలియడం లేదు. కానీ మెగా బ్రదర్ నాగబాబు వల్లే పవన్ రేణు దేశాయ్ విడిపోయారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ హీరోగా నాగబాబు నిర్మాతగా 2010లో ఆరంజ్ సినిమాకీ ప్రొడ్యూసర్ గా చేశారు. అయితే ఈ సినిమా ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఆర్థిక ఇబ్బందులతో నాగబాబు ఆత్మహత్యకు కూడా సిద్ధమయ్యారనే వార్తలు వినిపించాయి.. అయితే పవన్ కళ్యాణ్ విషయం తెలుసుకున్న తర్వాత తన అన్నయ్యని ఆ పరిస్థితిలో చూసి తనకు సాధ్యమైనంత డబ్బులను నాగబాబుకి ఇచ్చి ఆదుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం రేణు దేశాయ్ కు తెలిసి మీ అన్నయ్యకి డబ్బు అంత ఇచ్చేస్తే మన పిల్లల భవిష్యత్తు ఏంటనే పవన్ తో వాగ్దానానికి దిగిందట. ఈ విషయంలో ప్రతిరోజు గొడవ పడుతూ ఉండడంతో చివరికి పవన్ కళ్యాణ్ ఆమె నుంచి విడిపోయారని సమాచారం. వీరి గొడవకు కారణం నాగబాబు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.