పుష్ప-2 ఎంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిందో తెలిస్తే షాకే!

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అక్టోబర్ లోగా సినిమా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. పుష్ప మొదటి భాగం దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసిన కారణంగా పార్ట్ 2 బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు.

పుష్ప పార్ట్ 2 కోసం ఇప్పటికే రూ.200 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. సినిమా షూటింగ్ పూర్తి అయ్యేలోగా మరో 150 లేదా 200 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి చేస్తే ఈ ఏడాది చివర్లో పుష్ప-2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిచన బిజినెస్ లెక్కలు అభిమానుల ఊహకు కూడా అందనంత రేంజ్ లో ఉంటాయని సమాచారం. ఫ్రీ రిలీజ్ బిజినెస్ కి రూ. 500 కోట్లు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో 500 కోట్ల కలెక్షన్స్ అనేది బాగా కామన్ అయిపోయింది. కాబట్టి పుష్ప-2 సినిమా మినిమమ్‌ రూ.1000 కోట్ల టార్గెట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కాబట్టి ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్లు ఉండటం పెద్ద విషయం ఏం కాదు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం పుష్ప 2 గురించి ఎటువంటి హడావుడి లేదు. అయినప్పటికీ 500 కోట్ల బిజినెస్ జరుగుతుందని చర్చ జరగటం అయితే ఆశ్చర్యపడే విషయమే. అసలు హడావుడి అనేది సినిమా రిలీజ్ అయ్యే రెండు మూడు నెలల ముందు నుండి మొదలవుతుంది. అప్పుడు మనం అనుకున్నదానికంటే ఎక్కువ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మారి పుష్ప 2 బిజినెస్ ఎలా ఉంటుందో అనేది.