విషమించిన జబర్దస్త్ పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి.. ఆందోళన లో ఫ్యాన్స్..!

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ఆయన కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీనికోసం ఆయన డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారు. రెగ్యులర్గా డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ కూడా ఆయన ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. పైగా ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమించింది అని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తెలియజేశారు.

వీలైనంత త్వరగా ఆయనకు ఆపరేషన్ చేయాలి అని అందుకు చాలా ఖర్చు అవుతుంది అని.. దాతలు కూడా సహాయం చేయాలి అని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని ఈరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో చేసి మరీ రిలీజ్ చేశారు. ఇందులో నూకరాజు మాట్లాడుతూ ఎన్నో ఆసుపత్రులు తిరిగాము.. అయినా ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ఎటువంటి మార్పు లేదు.. మూడు సంవత్సరాల క్రితమే రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వగా అప్పటినుంచి ఆయన ఆ బాధను అలాగే భరిస్తున్నారు.

ఈ కిడ్నీ సమస్య ఉన్నవారికి ఒకదాని వెనుక ఒకటి జబ్బులు వస్తూనే ఉంటాయి అన్న విషయంలో కూడా ఇదే జరిగింది. వీలైనంత త్వరగా అతడికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించాలని వైద్యులు చెప్పారు. లేదంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అని కూడా అంటున్నారు. కిడ్నీ ఆపరేషన్ కి లక్షల్లో ఖర్చు అవుతుందట. అందుకే చేతులెత్తి వేడుకుంటున్నాను. దయచేసి మీకు తోచినంత సహాయం చేయండి అంటూ సహాయం కోసం అర్జించాడు. నూకరాజు ప్రస్తుతం ఈ వీడియోలో పంచ్ ప్రసాద్ ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని కనిపించడం మనం చూడవచ్చు. ఇక ఆయన భార్య బాధ వర్ణనాతీతం అని చెప్పాలి.