కీర్తి సురేష్ కు మైండ్ గానీ దొబ్బిందా.. అలాంటి చెత్త ప‌ని ఎలా చేస్తుంది..?

మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అందాల భామ కీర్తి సురేష్.. ఆ తర్వాత వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది. కానీ ఏ ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడడంతో మళ్ళీ కమర్షియల్ చిత్రాల‌నే నమ్ముకుంది. అలా సర్కారు వారి పాట, దసరా చిత్రాలతో హిట్స్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది.

ముఖ్యంగా ఇటీవల విడుదలైన దసరా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో కీర్తి సురేష్ ద‌శ తిరిగిన‌ట్టే అని అంద‌రూ అనుకున్నారు. అయితే ఇలాంటి తరుణంలో కీర్తి సురేష్ మళ్లీ ఓ లేడీ ఓరియెంటెడ్ క‌థ‌కు క‌మిట్ అయిన‌ట్లు వార్తలు వస్తున్నాయి. పైగా ఇందులో కీర్తి సురేష్ తో జోడీగా ఒక కమెడియన్ న‌టించ‌బోతున్నాడ‌ట‌. కీర్తి సురేష్ పాత్ర ప్ర‌ధానంగా సాగే ఈ మూవీతో ఓ కొత్త ద‌ర్శ‌కుడు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతున్నాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించ‌నున్నార‌ట‌.

కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ చిత్రాలలో హీరో గా మారిన క‌మెడియ‌న్ సుహాస్ ఈ చిత్రంలో కీర్తి సురేష్ కు జోడీగా ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడ‌ట‌. అయితే ఇప్పుడు ఈ విష‌య‌మే ఫ్యాన్స్ కి మింగుడు ప‌డ‌టం లేదు. కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటుతోంది. కెరీర్ ఆరంభం నుంచి పెద్ద పెద్ద హీరోల‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అలా ఆమె ఒక క‌మెడియ‌న్ తో జ‌త‌క‌ట్ట‌డం ఫ్యాన్స్ జీర్ణించుకోలేక‌పోతున్నారు. కీర్తి సురేష్ కు మైండ్ గానీ దొబ్బిందా.. అలాంటి చెత్త ప‌ని ఎలా చేస్తుంది.. చేతులారా కెరీర్ ను నాశ‌నం చేసుకుంటుంద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మరికొంద‌రు మాత్రం కీర్తి సురేష్ కు స‌పోర్ట్ గా నిలుస్తున్నారు. చిన్న హీరో ఏంటి.. పెద్ద హీరో ఏంటి.. క‌థ బాగుంటే ఈ హీరోతో అయినా న‌టించాల‌ని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద స్టార్స్ గా వెలుగొందుతున్న వారంద‌రూ ఒక‌ప్పుడు చిన్న హీరోలే అంటూ కీర్తి సురేష్ ఫ్యాన్స్ కి హిత‌వు ప‌లుకుతున్నారు.