సాయి పల్లవి పాటకు డాన్స్ వేసిన సితార..వీడియో వైరల్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి చెప్పాల్సిన పనిలేదు ఎలాంటి విషయంలోనైనా సరే చురుకుగా ఉంటుంది ఇప్పుడు తాజాగా డాన్స్ తో అదరగొడుతోంది. ప్రేక్షకులలో, సోషల్ మీడియాలో సితార మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ మధ్యనే టాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కు డాన్స్ చేసి అదరగొట్టింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయక క్షణాల్లో అది వైరల్ గా మారుతోంది.

అంతేకాకుండా సాయి పల్లవి పాటకు అద్భుతంగా డాన్స్ చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇన్స్టాల్ లో నిత్యం సందడి చేస్తూ ఉంటుంది. ఇప్పటికే సితారకు రెండు మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.యూట్యూబ్లో సొంతంగా ఒక ఛానల్ కూడా రన్ చేస్తోంది..ఇదంతా కాస్త పక్కన పెడితే ఈ మధ్యనే సితార కొరియోగ్రాఫర్ హనీ మాస్టర్ వద్ద డాన్స్ నేర్చుకుంటోందట. ఈ క్రమంలోనే బాలీవుడ్ లోనూ టాలీవుడ్ లోనూ మంచి మంచి సాంగులకు డాన్సులు చేస్తూ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది.

ఈ మధ్యనే నాచురల్ బ్యూటీ సాయి పల్లవి చేసిన సారంగదరియా పాటకు అద్భుతంగా స్టెప్పులు వేసి మెప్పించింది సితార. సితార లంగా వోనిలో సాయి పల్లవిని మరిపించేలా కనిపించింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అక్కడ ప్రిన్సెస్ అదరగొట్టింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ ని చూసిన నమ్రత శిరోద్కర్ హాట్ ఎమోజిని షేర్ చేసింది. అయితే చాలా మంది మహేష్ బాబు కూతురు త్వరలోనే సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by sitara 🍓 (@sitaraghattamaneni)