ప్రాజెక్టు కే సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..!!

ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా ఈనెల 16వ తేదీన విడుదలై కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించుకుంటోంది. వీకెండ్ వరకు కళకళలాడిన ఈ సినిమా ఆ తర్వాత కాస్త కలెక్షన్లు కూడా డ్రాప్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు కారణం ఈ సినిమాకి వచ్చిన నెగిటివ్ టాక్ కారణమే అన్నట్లుగా సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ప్రభాస్ తన తదుపరి చిత్రం సలార్ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

Project K: BTS video of 'Raiders' from Prabhas, Deepika Padukone-starrer  goes viral| WATCH | Celebrities News – India TV
భారీ అంచనాలతో ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతోంది. కేవలం ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేశారు. టీజర్ జులై మొదటి వారంలో రాబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న మరొక చిత్రం ప్రాజెక్ట్-K సినిమాకు సంబంధించి ఒక మోషన్ పోస్టర్ కూడా జులైలో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మోషన్ పోస్టర్ని ఇండియాలోనే కాకుండా యూఎస్ లో భారీ ఈవెంట్ గా ప్లాన్ చేసి విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

ప్రాజెక్ట్-K సినిమా ఫస్ట్ ప్రమోషన్ యూఎస్ఏ లను మొదలు పెట్టాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ప్రాజెక్ట్ కే సినిమా వరల్డ్ వైస్ గా మంచి బజ్ ఏర్పడడం పక్క అని అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ చిత్రాన్ని రూ .500 కోట్ల రూపాయల బడ్జెట్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ నాగ్ వంశీ. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్ ,దీపికా పదుకొనే, దిశాపటాని తదితరులు నటిస్తున్నారు.