“దేవర” సినిమా కంటే ముందే తెలుగులో జాన్వీ చేయాల్సిన సినిమా ఏంటో తెలుసా..? సర్వ నాశనం చేసింది వాడే..?

అతిలోకసుందరి ముద్దుల కూతురుగా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వి కపూర్ తెలుగులో కూడా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్ గా ముందుకు వెళ్తుంది ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి క్రేజ్ దక్కించుకుందే గాని హిట్ ట్రాక్ అందుకోలేకపోయిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో దేవర అనే సినిమాలో డెబ్యూ ఇస్తుంది . ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించడం శ్రీదేవి అభిమానులకు మరింత హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసింది.

కాగా ఇదే క్రమంలో దేవర సినిమా పోస్టర్లో జాన్వికపూర్ చాలా ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించడం మరింత స్థాయిలో ఆకట్టుకుంటుంది. కాగా ఇదే మూమెంట్ లో దేవర సినిమా కంటే ముందే జాన్వి కపూర్ తెలుగు సినిమా ద్వారా పరిచయం అవ్వాల్సింది. కానీ ఆమె మేనేజర్ చేసిన పొరపాటు కారణంగానే ఆమె స్కిప్ అయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఆ సినిమా మరేదో కాదు అఖిల్ అక్కినేని కెరియర్ లోనే హిట్గా నిలిచిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ . బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రొమాంటిక్ హిట్గా బాక్సాఫీస్ వద్ద టాక్ అందుకుంది . ఈ సినిమాలో మొదటిగా హీరోయిన్ గా అనుకునింది జాన్వి నే అట . జాన్వి కూడా స్టోరీ విని ఇంప్రెస్ అయ్యిందట . సినిమా ఓకే చేద్దాం అనుకున్న టైంలో మేనేజర్ అక్కినేని అఖిల్ ట్రాక్ రికార్డు చెప్పి సినిమాని రిజెక్ట్ చేసేలా చేశాడు. ఆ తర్వాత ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది. ఏ మాటకు ఆ మాట పూజా హెగ్డే అఖిల్ రొమాన్స్ సినిమాలో మాత్రం హైలెట్గా నిలిచింది..!!