పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కు యాంక‌ర్ సుమ అక్క‌గా న‌టించిన సినిమా ఏదో తెలుసా..?

బుల్లితెర‌పై యాంక‌ర్ సుమ‌కు ఉన్న క్రేజ్‌, ఫాలోయింగ్ ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. టాలీవుడ్‌లో గ‌త కొన్నేళ్ల నుంచి నెం. 1 యాంక‌ర్ గా సుమ స‌త్తా చాటుతోంది. ఎంతో మంది కొత్త యాంక‌ర్లు వ‌స్తున్నా.. స్కిన్ షోతో రెచ్చిపోతున్నా.. సుమ ప్లేస్ ను మాత్రం ఏ ఒక్క‌రూ రీప్లేస్ చేయ‌లేక‌పోయారు. అలాగే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, స‌క్సెస్ మీట్స్ కు హోస్ట్ సుమ‌నే కావాల‌నే హీరోలు ఎంద‌రో ఉన్నారు.

అలాగే సినిమా ప్ర‌మోష‌న్స్ కు కూడా సుమ‌ను బాగానే వాడేసుకుంటున్నారు. అలాంటి సుమ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కు అక్క‌గా ఓ సినిమా చేసింద‌ని మీకు తెలుసా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. నిజానికి హీరోయిన్ అవుదామ‌ని సుమ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చింది. కెరీర్ ఆరంభంలో అనేక చిత్రాలు చేసింది. హీరోయిన్ గానే కాకుండా ప‌లు సినిమాల్లో స‌హాయ‌క పాత్ర‌ల‌ను కూడా పోషించింది.

అలా సుమ ఓ సినిమాలో ప్ర‌భాస్ కు అక్క‌గా చేసింది. ఇంత‌కీ ఈ సినిమా మ‌రేదో కాదు `వ‌ర్షం`. ఇందులో త్రిష హీరోయిన్ గా న‌టిస్తే.. గోపీచంద్ విల‌న్ గా న‌టించారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో ప్ర‌భాస్ అక్క పాత్ర‌లో తెర‌పై సుమ కాసేపు క‌నిపిస్తుంది. కానీ, ఇది చాలా మందికి తెలియ‌దు. ఇక ఈ విషయాన్ని ఇటీవ‌ల ఓ ఈవెంట్ లో సుమ గుర్తు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో కాస్త ఇప్పుడు వైర‌ల్ గా మారింది.