హరిహర వీరమల్లు సినిమా అట్టకెక్కినట్టేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమా లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా షూటింగును మాత్రం ఇంకా పూర్తి చేయలేదు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో పవన్ కళ్యాణ్ మిగతా సినిమాలను పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారు.

Hari Hara Veera Mallu Power Glance: Pawan Kalyan has no competition |  Entertainment News,The Indian Express
పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో వంటి సినిమాకి ప్రాధాన్యత ఇస్తున్నారు.దీంతో హరిహర వీరమల్లు సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు.. మొదట ఈ సినిమా నుంచీ వారియర్ లుక్కు విడుదల కావడంతో ఈ సినిమా పైన అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూసేవారు.. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి భారీ సెట్టింగ్స్ సైతం షూటింగ్ కోసం వేసి ఎదురుచూస్తున్నట్టుగా చిత్ర బృందం తెలుస్తోంది. కొంతమేర ఈ సినిమా షూటింగ్ మిగిలి ఉన్నట్లు సమాచారం. కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు సమాచారం.

కానీ ఎన్నోసార్లు బారి సెట్టింగ్స్ ను హైదరాబాదులో మేకర్స్ వేసి కొద్ది రోజులు గడుస్తున్న ఈ సినిమా షూటింగ్ కి మాత్రం పవన్ కళ్యాణ్ రాకపోవడంతో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ సెట్స్ ని మేకర్స్ తీసేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు నచ్చలేదా అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డేట్లు అడ్జస్ట్ చేయలేకపోవడంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్స్ సైతం నటిస్తూ ఉన్నారు.