ర‌ష్మిక బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. ఖాళీ దొరికిందంటే పాప‌కు అదే ప‌న‌ట‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో ఈ అమ్మ‌డు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2` మూవీలో న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ర‌ణ్‌బీర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` సినిమా చేస్తోంది. ఇవి రెండు సెట్స్ మీద ఉండ‌గానే ర‌ష్మిక `రెయిన్ బో` అనే మూవీకి క‌మిట్ అయింది.

ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం. కెరీర్ లోనే తొలిసారి ర‌ష్మిక ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసింది. ఇందులో `శాకుంత‌లం` ఫేమ్ దేవ్ మోహ‌న్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. కొద్ది రోజుల క్రిత‌మే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అయింది. వీటితో పాటు మ‌రికొన్ని ప్రాజెక్ట్ లు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ర‌ష్మిక గురించి ఎన్ని వ‌ర్ణించినా త‌క్కువే అవుతుంది.

అందుకే ఈ క‌న్న‌డ నుంచి దిగుమ‌తి అయిన ఈ సోయ‌గం.. త‌క్కువ స‌మ‌యంలో నేష‌న‌ల్ క్ర‌ష్‌గా పేరు సంపాదించుకుంది. అయితే ర‌ష్మిక అందంగా ఉండ‌టానికి ఓ కార‌ణం ఉంద‌ట‌. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ర‌ష్మిక త‌న బ్యూటీ సీక్రెట్ ను బ‌య‌ట పెట్టింది. త‌న అందం త‌గ్గ‌కుండా ఉండేందుకు ర‌ష్మిక అమ్మ చెప్పిన ఈ చిట్కాను పాటిస్తుంద‌ట‌. గోరు వెచ్చని కొబ్బరి నూనెతో ముఖం, జుట్టు మర్దనా చేసుకుంటుంది. ఏ మాత్రం ఖాళీ స‌మ‌యం దొరికినా పాప‌కు అదే ప‌న‌ట‌. అందుకే త‌న స్కిన్ గ్లోయింగ్‌గా, షైనీగా మెరుస్తుంటుంద‌ని ర‌ష్మిక అంటోంది.