ఓటిటిలోకి వచ్చేస్తున్న కస్టడీ.. ఎప్పుడంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య రీసెంట్గా నటించిన చిత్రం కస్టడీ.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇక కస్టడీ సినిమాలో నాగచైతన్య కానిస్టేబుల్ పాత్రలో అద్భుతంగా నటించారు అలాగే తమిళ నటుడు అరవింద స్వామి ఈ చిత్రంలో విలన్ గా నటించడం జరిగింది. చైతన్య నటనపరంగా మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు.

కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో డిజాస్టర్ గా మిగిలింది. దీంతో అతి తక్కువ సమయంలోనే ఈ సినిమా ఓటీటి లో స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 9వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్విమ్మింగ్ కాబోతున్నట్లు అధికారికంగా అమెజాన్ ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ చాలా థియేటర్లో ఆకట్టుకోలేకపోయిన సినిమాలు అతి తక్కువ సమయంలోనే ఓటీటి లో ఎంట్రీ ఇచ్చి బాగానే ఆకట్టుకున్నాయి. ఇలాగే కష్టడి సినిమా కూడా ఓటిటిలో సూపర్ సక్సెస్ అవుతుందని నాగచైతన్య అభిమానులు భావిస్తున్నారు.

ఇందులో వెన్నెల కిషోర్ సంపత్ రాజు శరత్ కుమార్ ప్రియమణి తదితరులు సైతం కీలకమైన పాత్రలు నటించారు కెరియర్లు మొదటిసారి నాగచైతన్య కానిస్టేబుల్ గెటప్ లో కనిపించడం జరిగింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది. గతంలో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు నాగచైతన్య ప్రకటించడం జరిగింది. ఈ మధ్యకాలంలో నాగచైతన్య సరైన సక్సెస్ అందుకోలేక పోతున్నారు.