అందాల భామ అనుష్క‌కు ఉన్న అతి పెద్ద వీక్‌నెస్ ఏంటో తెలుసా?

సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి ప్రస్తుతం యంగ్‌ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి`. పి. మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. రీసెంట్గా అనుష్క జయప్రద హోస్ట్ గా వ్యవహరిస్తున్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈ ఇంటర్వ్యూలో అనుష్క తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. 6వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న రోజుల్లోనే త‌న‌కు ఫ‌స్ట్ ల‌వ్ ప్ర‌పోజ‌ల్ వ‌చ్చింద‌ని.. అదొక స్వీట్ మెమెరీగా అని తెలిపింది. అలాగే హీరోయిన్ల‌లో న‌య‌న‌తార, త్రిష‌, భూమిక అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని.. వారి న‌ట‌న‌తో పాటు వ్య‌క్తిత్వం కూడా చాలా గొప్ప‌గా ఉంటుంద‌ని వెల్ల‌డించింది.

ఈ క్ర‌మంలోనే త‌న‌కు ఉన్న అతి పెద్ద వీక్‌నెస్ ను కూడా అనుష్క బ‌య‌ట పెట్టింది. తాను ఫోన్‌ని సరిగ్గా క్యారీ చేయనని, అదే తన పెద్ద వీక్‌నెస్‌ అని అనుష్క పేర్కొంది. నిజంగానే ఈ విష‌యంలో అనుష్క‌పై చాలా మంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరోలు కంప్లైంట్ చేశారు. ప్ర‌భాస్ కూడా గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో ఫోన్ చేస్తే ఎత్త‌ద‌ని, అదే అనుష్క‌తో పెద్ద స‌మ‌స్య అని తెలిపాడు. దీంతో అనుష్క కామెంట్స్ కాస్త ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.