`దేవ‌ర‌`పై బ్లాస్టింగ్ అప్డేట్‌.. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూన‌కాలే!?

ఆర్ఆర్ఆర్ వంటి ఆస్కార్ అవార్డ్‌ విన్నింగ్ మూవీ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న రెండో ప్రాజెక్ట్ ఇది. ఈ మూవీకి `దేవర` అనే టైటిట్ ను కన్ఫామ్ చేశారు. శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఏ మూవీ పై బ్లాస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటో తెలిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఇందులో ఎన్టీఆర్ డబుల్ రూల్స్ లో కనిపించబోతున్నాడట. అందులో ఒకటి మాస్ అయితే.. మరొకటి క్లాస్ అని అంటున్నారు.

ఈ రెండు పాత్రలను కొరటాల శివ వావ్ అనేలా తీర్చిదిద్దుతున్నాడట. అయితే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడా.. లేక రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడా.. అన్నది మాత్రం సస్పెన్స్. ఇకపోతే ఆచార్య వంటి బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అనంతరం కొరటాల శివ చేస్తున్న సినిమా ఇది. అయితే దేవరతో కచ్చితంగా హిట్ కొట్టాలని కొరటాల పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ స్క్రిప్ట్ పై చాలా నెలలు కసరత్తు చేసి రంగంలోకి దిగాడు. మరి దేవ‌ర ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.