అనుష్కతో బోల్డ్ సీన్స్ ఒప్పుకున్న యంగ్ హీరో.. ఔట్‌పుట్ ఎలా ఉంటదో!

ప్రముఖ నటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చాలా రోజుల గ్యాప్ తరువాత ఈ అమ్మడు నటించబోతున్న సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారి నిర్మిస్తుండగా, మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ వల్ల సినిమా పై ప్రేక్షకులో అంచనాలు పెరుగుతున్నాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించిన నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో తన సత్తా చాటుకోబోతున్నాడు.

మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఫుల్ గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు నవీన్ పోలిశెట్టి. అయితే ఈ సినిమాలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ నవీన్ పోలిశెట్టితో నటించడమే. ఇక ఈ సినిమాలో నవీన్ కి అనుష్క కి మధ్య చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయని ఆడియన్స్ ఆశపడుతున్నాడు. మరి నిజంగానే ఇదొక రొమాంటిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ కాబట్టి కచ్చితంగా వారిద్దరి మధ్య రొమాన్స్ ఉంటుందని భావించొచ్చు.

స్టార్ హీరోయిన్‌తో స్క్రీన్ మీద నవీన్ రొమాన్స్ ఎలా చేస్తాడో చూడాలి. అసలయితే అనుష్క లాంటి అందగత్తె పక్కన కొంతమంది హీరోలు మాత్రమే సెట్ అవుతారు. అలాంటిది ఆ బ్యూటీ పక్కన నవీన్ స్క్రీన్ పై ఎలా కనిపిస్తాడో చూడాలి ఇక. అలాగే జాతి రత్నాలు లెవెల్లో నవీన్ తన ఖాతాలో మరో హిట్ వేసుకుంటాడో లేదో చూడాలి.