ఒక్క యాడ్ కోసం భారీగా ఛార్జ్ చేసిన సమంత.. ఎంతో తెలిస్తే..

ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఇంకోవైపు యాడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తుంది. లేటెస్ట్‌గా సమంత టామీ హిల్ ఫిగర్ యాడ్ లో నటించింది. సినిమాల్లో స్లిమ్ గా కనిపించే ఈ బ్యూటీ టామీ హిల్ ఫిగర్ యాడ్ మాత్రం కాస్త బొద్దుగానే కనపడింది. దాంతో సమంత అభిమానులు కాస్త సర్‌ప్రైజ్ అయ్యారు. ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన టామీ హిల్ ఫిగర్ రిస్ట్ వాచ్ బ్రాండ్ కి సమంత ప్రమోటర్ గా నిర్వహిస్తుంది.

అయితే ఈ యాడ్ కోసం సమంత భారీగా ఛార్జ్ చేస్తుందని సమాచారం. ఇలాంటి యాడ్స్ లో సమంత నటించడం మొదటిసారి ఏమీ కాదు. సమంత హీరోయిన్ గా చాలా బిజీగా ఉన్న సమయంలో ఇలాంటి యాడ్స్ చాలానే చేసింది. అయితే తాజాగా టామి హిల్ ఫిగర్ యాడ్ కోసం చేసిన యాడ్ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ తో తన రేంజ్ ని మరో సారి గుర్తు చేసింది. అయితే అసలు సమంత ఈ యాడ్ కోసం ఎంత తీసుకుంది అనే ప్రశ్న చాలా మందిలో మొదలైంది.

సమంత టామీ హిల్ ఫిగర్ యాడ్ కోసం దాదాపు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్లు సమాచారం. సినిమాల్లో నటిస్తే ఎంత రెమ్యూనరేషన్ వస్తుందో దానికి సమానంగా యాడ్ కోసం పారితోషికాన్ని డిమాండ్ చేసిందట సామ్. అయితే సమంతకు ఉన్న క్రేజ్ ని బట్టి చూస్తే రెండు మూడు కోట్లు అనేది పెద్ద విషయమేమీ కాదని అంటున్నారు చాలామంది. ఏదైతేనేం ఒకవైపు సినిమాల్లో ఇంకో వైపు యాడ్స్ ద్వారా సామ్ చేతినిండా సంపాదిస్తుంది.