బాలీవుడ్ లో అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకున్న ముద్దుగుమ్మల్లో కియారా అద్వానీ ఒకటి. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. టాలీవుడ్ లో కియారా భారత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాల్లో నటించింది.
ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలతోనే బిజీ అయిన కియారా.. చాలా కాలం తర్వాత తెలుగులో ఓ మూవీకి సైన్ చేసింది. అదే గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది.
అన్నట్లు ఇటీవలె కియారా పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. తన ప్రియ సఖుడు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడు అడుగులు వేసింది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న కియారా.. స్కిన్ షో విషయంలోనూ ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు.
పైగా రోజు రోజుకు బట్టల సైజు తగ్గిస్తూ అందాలు ఆరబోస్తోంది. తాజాగా వైట్ కలర్ మినీ ఫ్రాక్ లో చూపిస్తూ మంటలు రేపింది. కియారా తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ పిక్స్ చూసి కుర్రకారు మెంటలెక్కిపోతున్నారు. కియారా ఇంత హాట్ గా ఉందేంట్రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు. మరి మీరు కూడా కియారా పిక్స్ పై ఓ లుక్కేసేయండి.