అపోలో ఆసుపత్రి వద్ద చక్కెర్లు కొడుతున్న నిహారిక కొణిదెల!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసనకి మంగళవారం ఉదయం జూన్ 20వ తేదీన పండంటి కూతురు జన్మించిన సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లయిన 11 సంవత్సరాల తర్వాత ఈ దంపతులకు కూతురు జన్మించటంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. దాంతో నిన్నటి నుండి చరణ్ కూతురిని చూడటానికి మెగా కుటుంబ సభ్యులు భారీ ఎత్తున హైదరాబాద్ జూబ్లీహిల్స్ హాస్పిటల్ కి తరలి వస్తున్నారు. మొన్న చిరంజీవి, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ మరికొంతమంది కుటుంబ సభ్యులు రావడం జరిగింది. కాగా నేడు మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక పాపను చూడటానికి రావడం జరిగింది.

సరిగ్గా అదే సమయంలో ఆమె కెమెరాలకు చిక్కడంతో మనవాళ్ళు పండగ చేసుకున్నారు. పింక్ కలర్ చీర కట్టులో నిహారిక చాలా సాంప్రదాయబద్ధంగా.. అపోలో ఆసుపత్రి వద్ద సందడి చేయడం జరిగింది. ఇకపోతే నాగబాబు కూతురు నిహారిక 2021లో గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యనీ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసినదే. ఐతే నిహారిక అతనితో విడిపోయినట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

అయితే ఇటీవల వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుకలో కూడా నిహారిక ఒంటరిగా కనిపించి ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుంది. ఇకపోతే నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొన్నాళ్ళకు సినిమాలకు దూరంగా ఉంటోంది. అడపాదడపా టీవీ షోలలో తప్పితే ఆమె సినిమాలు చేస్తున్న దాఖలాలు కనబడడం లేదు. వివాహం తరువాత ఆమె పూర్తిగా సినిమాలకు దూరం అయింది. వారు నిజంగా విడాకులు తీసుకోవాలని అనుకుంటే మాత్రం…. ఆమె మరలా సినిమాలలో హీరోయిన్ గా కొనసాగే అవకాశం కలదు. ఇకపోతే రామ్ చరణ్ కూతురిని చూడడానికి నిన్న వైట్ కలర్ డ్రెస్ లో చాలా క్యాజువల్ లుక్ లో బన్నీ భార్య స్నేహ రెడ్డితో కలిసి అపోలో ఆసుపత్రిలో సందడి చేయడం జరిగింది.