ఆదిపురుష్.. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు వేల థియేటర్స్ లో విడుదలైన మైథలాజికల్ మూవీ ఇది. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విడుదలైన నాటి నుంచి ఈ సినిమాపై ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి.
అలాగే మరెన్నో వివాదాలు చుట్టు ముడుతున్నాయి. అయితే నెగటివిటీనే ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పాలి. టాక్ ఎలా ఉన్నా.. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్దు దుమ్ము దుమారం రేపుతోంది. వర్కింగ్ డేస్ లో కాస్త వీక్ అయినా సరే మంచి వసూళ్లను రాబడుతోంది. బాక్సాఫీస్ వద్ద ఆరు రోజులు కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 74.30 కోట్ల షేర్, రూ. 118.60 గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అలాగే వరల్డ్ వైడ్ గా రూ.175.76 కోట్లు షేర్, రూ. 355.00 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. రూ. 242 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. ఆరు రోజుల్లో, అది కూడా నెగటివ్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం చూసి నెటిజన్లకు మతిపోతోంది. ఇంకా రూ. 66.24 కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించుకుంటే ఆదిపురుష్ లాభాల బాట పట్టడం ఖాయమవుతుంది. కాగా, ఏరియాల వారీగా ఆదిపురుష్ 6 డేస్ టోటల్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నైజాం: 33.87 కోట్లు
సీడెడ్: 8.89 కోట్లు
ఉత్తరాంధ్ర: 9.52 కోట్లు
తూర్పు: 5.55 కోట్లు
పశ్చిమ: 3.91 కోట్లు
గుంటూరు: 6.35 కోట్లు
కృష్ణ: 4.14 కోట్లు
నెల్లూరు: 2.07 కోట్లు
————————————————-
ఏపీ+తెలంగాణ= 74.30 కోట్లు(118.60 కోట్లు~ గ్రాస్)
————————————————-
కర్ణాటక: 11.55 కోట్లు
తమిళనాడు: 2.26కోట్లు
కేరళ: 0.80 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా: 63.80 కోట్లు
ఓవర్సీస్: 23.05 కోట్లు
—————————————————
వరల్డ్ వైడ్ కలెక్షన్= 175.76 కోట్లు(355.00 కోట్లు~ గ్రాస్)
—————————————————