పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా ‘ఆదిపురుష్’. ప్రభాస్ శ్రీముడిగా, కృతి సనన్ సీతగా, సన్ని సింగ్ లక్ష్మణుడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించిన ఈ సినిమా మిశ్రమ స్పందనను దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో హనుమంతుడిగా దేవ్ దత్త కనువిందు చేసాడు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అది అలా ఉంటే ఈ సినిమా టిక్కెట్ రేట్లు తగ్గనున్నాయని తాజాగా చిత్ర యూనిట్ ఆఫీసియల్ అనౌన్సమెంట్ చేసింది. ఈ సినిమా 3డి వెర్షన్ టిక్కెట్ ధరలు రాబోయే రెండు రోజులకు (22, 23) రూ. 150 రూపాయలకు పరిమితం చేయనున్నట్లు తెలిపింది టీమ్.
అయితే, ఈ ఆఫర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వర్తించదు. ఇది కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాలకు మాత్రమే అని సమాచారం. దాదాపుగా 400 కోట్లతో నిర్మించిన ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన వారి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సినిమాకి అయిన ఖర్చు కంటే పాత్రధారుల రెమ్యునరేష్ ఎక్కువగా ఉండడం కొసమెరుపు. శ్రీరాముడి పాత్రలో నటించిన ప్రభాస్‌కు 120 కోట్లు, సీత పాత్రలో నటించిన కృతి సనన్‌కు 3 కోట్లు, లంకేష్‌గా నటించిన సైఫ్ అలీ ఖాన్‌కు 12 కోట్లు, లంకేష్ భార్యగా నటించిన సోనాల్ చౌహాన్‌కు 50 లక్షలు, లక్ష్మణుడిగా చేసిన సన్నిసింగ్‌కు 1.5 కోట్లు, హనుమాన్‌గా చేసిన దేవ దత్తుకు కోటీ రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇకపోతే, ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మొదట సీత పాత్ర కోసం కృతి సనన్ కాకుండా మరో హీరోయిన్‌ను అనుకున్నారట. సీత పాత్రకి గాను మొదట దర్శక నిర్మాతలు స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణేను అనుకున్నారట. అంతేకాదు ఈ పాత్రకోసం ఆమెను సంప్రదించారట కూడా. అయితే అప్పటికే ఆమె పలు సినిమాలతో బిజీగా ఉండడంతో.. ఆదిపురుష్ సినిమాలో నటించలేకపోయారని వినికిడి. దీంతో ఆ రోల్ చివరకు కృతి సనన్‌కు చేరిందని టాక్ నడుస్తోంది. అది అలా ఉంటే ఈ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా అసలు రామాయణం కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం కొసమెరుపు.