అమ్మ బాబోయ్‌.. ర‌వితేజ‌కు, ఆయ‌న భార్య‌కు మ‌ధ్య ఏజ్ గ్యాప్ మ‌రీ అంత ఎక్కువా..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ గురించి కొత్త‌గా చెప్ప‌క్క‌ర్లేదు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ర‌వితేజ‌.. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించారు. చిన్న చిన్న పాత్ర‌ల‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత హీరోగా మారి అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హోదాను ద‌క్కించుకున్నాడు. ఇప్ప‌టికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ ను జెట్ స్పీడ్ ను తీసుకెళ్తున్నారు.

ఇక‌పోతే ర‌వితేజ వ్య‌క్తిగ‌త జీవితంకు సంబంధించిన విష‌యాలు పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌వు. రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. 2002 మే 26న కళ్యాణిని అనే అమ్మాయిని ర‌వితేజ వివాహం చేసుకున్నాడు. వీరిది పెద్ద‌లు కుదిర్చిన వివాహం. క‌ళ్యాణి మ‌రెవ‌రో కాదు ర‌వితేజ సొంత మేన‌మామ కూతురు. వీరి పెళ్లి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో చాలా ఘనంగా జరిగింది.

కళ్యాణి రవితేజకు చిన్నప్పటినుండి తెలిసిన అమ్మాయి. అయితే ర‌వితేజ‌కు, ఆయ‌న భార్య‌కు మ‌ధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకైపోతారు. ఎందుకంటే, వీరిద్ద‌రి మ‌ధ్య దాదాపు 13 ఏళ్లు వ‌య‌సు వ్య‌త్సాసం ఉంటుంది. అవును, క‌ళ్యాణి కంటే ర‌వితేజ 13 ఏళ్లు పెద్ద‌వాడు. ర‌వితేజ వ‌య‌సు 55 కాగా.. క‌ళ్యాణ్ వ‌య‌సు 42. కానీ, అప్ప‌ట్లో వ‌య‌సు పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు. అందుకే వీరిద్ద‌రికీ ముడి ప‌డింది క‌ళ్యాణ్ పెద్ద‌గా బ‌య‌ట క‌నిపించ‌రు. సినిమా ఫంక్ష‌న్స్ కూడా పాల్గొన్న సంద‌ర్భాలు చాలా అరుదు. అన్న‌ట్లు ఈ దంప‌తుల‌కు ఒక కూతురు, ఒక కొడుకు జ‌న్మించారు. ప్ర‌స్తుతం టీనేజ్ లో ఉన్న వారు చ‌దువుల‌పై దృష్టి సారించారు.