రాజకీయాల కారణంగా రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. `వకీల్ సాబ్` మూవీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అనంతరం పవన్ కళ్యాణ్ `భీమ్లా నాయక్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు చిత్రాలు ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలుసు. కానీ హిట్ అయినా సరే ఈ సినిమాలు భారీ నష్టాన్ని మిగిల్చాయని బిగ్ బాంబ్ పేల్చాడు పవన్ కళ్యాణ్.
ఈ రెండు సినిమాల విడుదల సమయంలో పవన్ కళ్యాణ్ ఏపీలో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ పై కక్ష సాధింపు కోసం ఆ రెండు సినిమాల రిలీజ్ టైమ్ లో ఏపీ సర్కార్ టికెట్స్ రేటును దారుణంగా తగ్గించేసింది. ఈ కారణంగానే ఏపీలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలకు రూ. 30 కోట్లు నష్టం వచ్చిందని తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ వెల్లడించాడు.
`వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రిలీజ్ అప్పుడు ఏపీలో టికెట్ రేట్లు భారీగా తగ్గించారు.. టికెట్ రేట్ కేవలం 10 రూపాయలు పెడితే పెట్టుబడి ఎప్పటికి తిరిగొస్తుంది?.. ఆ రెండు సినిమాలూ హిట్ కానీ ఏపీలో మాత్రం నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లింది. దాదాపు రూ.30 కోట్లు లాస్ వస్తే.. ఆ భారం మొత్తం నేనే భరించాను` అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు. దీంతో ఈయన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు వంటి ప్రాజెక్ట్ లు ఉన్నాయి. వీటిల్లో బ్రో మూవీ వచ్చే నెలలోనే విడుదల కాబోతోంది.