గేమ్ చేంజర్ చిత్రం నుంచి అంజలి ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..!!

మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లేవల్లో డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం మెగా అభిమానులైతే చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాకు మంచి హైప్ ఏర్పడుతోంది. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్, గ్లింప్స్ విడుదల కావడంతో ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోతున్నాయి.

Game Changer

ముఖ్యంగా దిల్ రాజు ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నది. సహజనటి అంజలి కూడా ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నది .తాజాగా నిన్నటి రోజున అంజలి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది మేకర్స్. తాజాగా విడుదలైన పోస్టర్ల అంజలి చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తోంది గతంలో ఈ సినిమా నుంచి లీకైన ఫోటోలతో మాత్రం ముఖ్యమంత్రి చరణ్ సతీమణిగా అంజలి కనిపించింది. ఇప్పుడు విడుదలైన ఈ ఫోటోలో మాత్రం చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ ఉండడం గమనార్హం.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో శంకర్ ఇండియన్-2 సినిమా చిత్రీకరణ షూటింగ్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో పూర్తి సమయాన్ని ఫ్యామిలీతో గడిపేందుకు రామ్ చరణ్ కూడా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. ఉపాసన డెలివరీ అయిన తర్వాత సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది.