రామ్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన.. రవి కిషోర్..!!

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఎనర్జిటిక్ హీరోగా పేరుపొందారు. వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తూ బిజీ హీరోగా మారిపోయారు. టాలీవుడ్ లో నటీనటులు సైతం ఈ మధ్యకాలంలో వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. ఇటీవలే నటుడు శర్వానంద్ కూడా వివాహం చేసుకున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ కూడా చాలా ఘనంగా జరిగింది.త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ హీరోల బాటలోనే మరొక హీరో రామ్ పోతినేని వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Ram Pothineni Wiki, Height, Family, Age, Affairs, Biography & More -  BigstarBio
ఈ విషయంపై రామ్ బాబాయ్ స్పందించారు.. స్రవంతి రవి కిషోర్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన స్రవంతి రవి కిషోర్ రామ్ పెళ్లిపై క్లారిటీ ఇవ్వడం జరిగింది.. స్రవంతి రవి కిషోర్ ఎవరో కాదు హీరో రామ్ కి స్వయానా బాబాయ్ అవుతారు.. దీంతో రామ్ పెళ్ళి పై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. రామ్ వివాహం చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదంటూ తెలియజేశారు. కేవలం ఇవన్నీ ఒక రూమర్సే అంటూ తెలిపారు.రామ్ వివాహం కనుక నిత్యమైతే ఆ విషయం దాచాల్సిన అవసరం లేదంటూ కూడా తెలియజేశారు.

Sravanthi Ravi Kishore - Alchetron, The Free Social Encyclopedia
అభిమానులు కూడా చాలా ఆత్రుతగా రామ్ వివాహం కోసం ఎదురుచూస్తున్నారు అలాంటప్పుడు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెడతాము అంటూ స్రవంతి రవి కిషోర్ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం రామ్ పెళ్ళి పై తన బాబాయ్ క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం వైరల్ గా మారుతోంది. రామ్ ,బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడం జరుగుతోంది.