పవన్ కళ్యాణ్ హీరోయిన్ కీర్తి రెడ్డి కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఎవరు..!

తొలిప్రేమ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ తొలిప్రేమ. ఒక్కసారిగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌ను మార్చేసింది. అంతేకాదు, బాక్సాఫీస్ వద్ద ఊహించనివిధంగా పవన్ మార్కెట్‌ను పెంచేసింది. ఈ సినిమాతో ఎ కరుణాకరన్ దర్శకుడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలాగే, కీర్తిరెడ్డి కూడా హీరోయిన్‌గా పరిచయమైంది. యేడాది పాటు ఆడిన తొలిప్రేమ స‌రికొత్త రికార్డు కూడా క్రియేట్ చేసింది.

23YearsForTholiPrema: Fans celebrate the anniversary of Pawan Kalyan and  Keerthi Reddy's eternal love saga | Telugu Movie News - Times of India

తొలిప్రేమ సినిమా ఇందులో పాటలు, సన్నివేశాలు, నటీనటుల పర్ఫార్మెన్స్ సంగీత దర్శకుడు అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వేసిన తాజ్ మహల్ సెట్..ఇలా ప్రతీదీ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక చరిత్ర సృష్ఠించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా ప్రతీ ఒక్కరి కెరీర్‌లో ఓ మైల్ స్టోన్‌గా నిలిచింది.

Keerthi Reddy Hot from Songs and Movie Scenes - YouTube

ముఖ్యంగా ఈ సినిమాతో పరిచయమైన కీర్తిరెడ్డికి అసాధారణమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఒక్క సినిమాతో అది కూడా మొదటి సినిమాతో అంత క్రేజ్ అండ్ పాపులారిటీ రావడం అంటే మామూలు విషయం కాదు. మరో హీరోయిన్ అయితే, ఈ క్రేజ్‌ను పక్కా కమర్షియల్‌గా మార్చుకుంటుంది. కానీ, వీరికి భిన్నంగా కీర్తిరెడ్డి కమర్షియల్ హీరోయిన్‌గా మారేందుకు పాకులాడలేదు. గ్లామర్ పాత్రలు, ఎక్స్‌ఫోజింగ్ రోల్స్ చేయడానికి ససేమిరా అన్నది.

అద్భుతంగా సాగాల్సిన కీర్తిరెడ్డి కెరీర్ అర్థాంతరంగా ముగియడానికి ఇదీ ఒక కారణం. ఇక అక్కినేని హీరో సుమంత్‌ను పెళ్ళి చేసుకోవడం మరో పెద్ద మైనస్ అని చెప్పాలి. అది కూడా కీర్తిరెడ్డి కెరీర్‌ను బాగా దెబ్బ తీసింది. సుమంత్‌తో పెళ్లి యేడాదికే విడాకులు అవ‌న్నీ ఆమెను బాగా ఇబ్బంది పెట్టాయి. సుమంత్‌ను కీర్తిరెడ్డి పెళ్లి చేసుకుని ఉండ‌క‌పోతే మ‌రి కొన్నాళ్లు ఆమె కెరీర్ ఖ‌చ్చితంగా కొన‌సాగి ఉండేదే..!

Keerthi Reddy: 'తొలి ప్రేమ' బ్యూటీ కీర్తి రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం..  కన్నీరుమున్నీరవుతున్న పవన్ హీరోయిన్.. | Pawan Kalyan Tholi Prema actress Keerthi  Reddy father TRS leader ...

సూపర్ స్టార్ మహేష్ బాబుకి సోదరిగా అర్జున్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ ఆ రకంగానూ కీర్తి కెరీర్ సాగలేదు. తొలిప్రేమ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను కాస్త కూడా కమర్షియల్‌గా ఉపయోగించుకోకపోవడం తన దురదృష్ఠం అని చెప్పాలి. ఇక సుమంత్‌కు విడాకులు ఇచ్చేసిన కీర్తిరెడ్డి ఎన్నారైను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది.

Share post:

Latest