రీసెంట్ కాలంలో కధ బాగున్నా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన టాప్ 5 మూవీస్ ఇవే.. ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాదుకున్న కథను మరో హీరో చేయడం సర్వసాధారణం . కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వక కావచ్చు … లేక కథ నచ్చక కావచ్చు. కారణం ఏదైనా సరే అలాంటి సినిమాలు వేరే హీరో నటించి హిట్ కొడితే ఆ బాధ వర్ణాతీతం. అలా ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలు అనుభవించారు . అయితే ఆ లిస్టులోకే వస్తాడు నందమూరి బాలకృష్ణ. ఒక అప్పట్లో నందమూరి బాలకృష్ణ ఎలాంటి క్రేజీరోల్స్ చేశారో ఇప్పటికి దానికి డబల్ రేంజ్ లో లో క్రేజీ క్రేజీ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

వీర సింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ప్రజెంట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు . కాగా బాలయ్య కూడా తన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నారట. కథ నచ్చిన కూడా కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక పొలిటికల్ మీటింగ్స్ కారణంగా కొన్ని సినిమాలు మిస్ చేసుకున్నారట . అయితే రీసెంట్ కాలంలో అలా బాలయ్య మిస్ చేసుకున్న ఐదు సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీగా నటించిన ఎఫ్2 సినిమాలో మొదట వెంకటేష్ పాత్రలో అనుకున్న హీరో బాలకృష్ణ నే అట. అయితే అప్పట్లో ఆ పాత్ర నచ్చిన కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక బాలయ్య ఆ రోల్ వదులుకున్నారట . ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన నారప్ప.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లా నాయక్..

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ ..మోహన్ రాజ లో దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్.. సినిమా కూడా మొదట అనుకున్న హీరో బాలకృష్ణ నేనట. అయితే కొన్ని కారణాల చేత కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక కథ నచ్చిన కూడా ఆయన ఆ సినిమాలు చేయలేకపోయారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా బాలయ్య తన మంచి సినిమాలను మిస్ చేసుకున్నాడు..!!