రెండేళ్ల తర్వాత అవకాశం అందుకుంటున్న రవితేజ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అవ్వాలని ఎంతోమంది కలలు కంటూ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలాంటి వారిలో మాళవిక శర్మ కూడా ఒకరు.. రవితేజ నటించిన నేల టికెట్ సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చూడడానికి అందంతోపాటు నటనపరంగా మంచి ప్రతిభావంతురాలని చెప్పవచ్చు. కానీ మాళవిక శర్మకు మాత్రం పెద్దగా లక్ కలిసి రాలేదు. రెండో ఆఫర్ కోసం దాదాపుగా మూడేళ్లపాటు వెయిట్ చేయవలసి వచ్చింది.. రెండో ఆఫర్ 2021లో రామ్ నటించిన రెడ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాలేక పోయింది.

Malvika Sharma UHD Stills | 123HDgallery
దీంతో కొత్త అవకాశాలు రాకపోవడంతో ఇతర భాషలలో ఈ ముద్దుగుమ్మ పలు ప్రయత్నాలు చేసింది. తమిళం మరియు హిందీలో మాళవికా శర్మ పలు సినిమాలలో నటించింది. ఆ సమయంలోనే తెలుగులో మరొక సినిమాలో నటించేందుకు అవకాశం రావడం జరిగింది.. హీరో గోపీచంద్ ఇటీవలే రామబాణం సినిమాతో ప్రేక్షకులను బాగానే అలరించారు.. తాజాగా కనడ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వంలో ఒక సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. యాక్షన్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమాలో మాళవిక శర్మకు అవకాశం దొరికినట్లు తెలుస్తోంది.

Hot and Cute Malavika Sharma- Dinamani
ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడిందంటే ఇక ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు వెలుపడతాయని అభిమానుల సైతం భావిస్తున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ అందాలను సైతం షేర్ చేస్తే ఉంటుంది మరి గోపీచంద్ తో నాయనా ఈ అమ్మడికి లక్ కలిసి వస్తుందేమో చూడాలి మరి.