రాధే శ్యామ్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..?

టాలీవుడ్ హీరో ప్రభాస్ హీరోయిన్ పూజ హెగ్డే కలయికలో వచ్చిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమాని డైరెక్టర్ రాధాకృష్ణ ఒక పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఈ చిత్రం గత ఏడాది మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్ లోని ఈ సినిమా విడుదలవ్వడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
Radhe Shyam teaser: Prabhas promises a timeless love story | Entertainment  News,The Indian Express
దీంతో మొదటి నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా నిర్మాతలకు ఏకంగా రూ .70 కోట్ల నష్టాలను మిగిల్చిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. యూరప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ క్లాసికల్ లవ్ స్టోరీ చిత్రం మొదట హీరోగా ప్రభాస్ ని అనుకోలేదట డైరెక్టర్ రాధాకృష్ణ. హీరో విక్టరీ వెంకటేష్ కోసం మొదట ఈ సినిమా కథను అనుకున్నారట. అయితే ఆయనకు కథ వినిపించడం జరిగిందట. అప్పటికే వెంకటేష్ చేతిలో వరుస ప్రాజెక్టులు ఉండడం చేత ఈ కథ సెట్ అవ్వదని రిజెక్ట్ చేసినట్లు సమాచారం.
Venkatesh Daggubati (Actor) Height, Age, Wife, Family, Children, Biography  & More - BigstarBio
ఆ తర్వాత ఈ స్టోరీ ప్రభాస్ కు చేరడంతో ఆయన కథ నచ్చడంతో ఒప్పుకోవడం జరిగింది. అలా వెంట వెంటనే ఈ సినిమా షూటింగును కూడా మొదలు పెట్టడం జరిగింది. కానీ ఈ సినిమాతో ప్రభాస్ అభిమానులకైతే నచ్చింది కానీ ప్రేక్షకులకు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా నాలుగు పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నారు. ఇందులో ఆది పురుష్ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో నైనా అటు ప్రేక్షకులను , అభిమానులను సైతం మెప్పిస్తారేమో చూడాలి మరి.

Share post:

Latest