హీరో రాజ్ తరుణ్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..?

టాలీవుడ్ లో యంగ్ హీరోగా పేరుపొందిన వారిలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. మొదట వరస సినిమాలతో బిజీగా ఉన్న రాజ్ తరుణ్ ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో రాజ్ తరుణ్ బ్రాండ్ ఇమేజ్ కూడా పడిపోయిందని చెప్పవచ్చు. కుమారి 21ఎఫ్, ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, తదితర చిత్రలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రాజు తరుణ్ ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు

Raj Tharun New Film Titled As 'Orey Bujjigaa' – TFPC
గతంలో ఎన్నో చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్న రాజు తరుణ్ కు ఈ మధ్యకాలంలో ఒక్క హిట్టు కూడా పడలేదు. అందగాడు సినిమా తర్వాత రాజ్ తరుణ్ 8 సినిమాలు చేశారు కానీ అందులో ఒక హిట్టు కూడా పడలేదు. అయినప్పటికీ పట్టుదలని విక్రమార్కుడుగా కథలు వింటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటే రాజు తరుణ్ మార్కెట్ కూడా చాలానే పడిపోయిందని వరుస డిజాస్టర్లతో తనతో నిర్మాతలు సైతం సినిమా చేయాలంటే కాస్త ఆలోచించే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా రాజ్ తరుణ్ కు ఒక బ్లాక్ బాస్టర్ సినిమా పడితే తప్ప తన కెరియర్ మళ్ళీ పుంజుకోలేదని చెప్పవచ్చు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సుకుమార్ మరొక శిష్యుడు రాజ్ తరుణ్ తో మూవీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరోకు కథ చెప్పినట్లుగా తెలుస్తోంది.ఈ కథ కూడా నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలో ఈ విషయం పైన అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఆహనా పెళ్ళంట వెబ్ సిరీస్ బాగానే ఆకట్టుకున్న పెద్దగా అవకాశాలు రాలేదు ఆ తర్వాత శ్రీనివాస్ గవిరెడ్డి తో ఒక సినిమా చేస్తున్నారు కానీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మరి సుకుమార్ శిష్యుడు రాజ్ తరుణ్ కెరీర్ ని మళ్లీ మారుస్తారేమో చూడాలి.

Share post:

Latest