“సమంత పై నాగ చైతన్య పాజిటివ్ కామెంట్స్”.. ఆ ఒక్క మాట వెనుక ఇంత కధ నడిచిందా..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఒక్కటే పేరు మారుమ్రోపోతుంది . అదే నాగచైతన్య ..అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగచైతన్య.. ఏం మాయ చేసావే సినిమాతో ఫస్ట్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు జోష్ సినిమా చేసిన పెద్దగా గుర్తింపు సంపాదించుకొని.. ఈ హీరో ఏం మాయ చేసావే సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు . ఇదే సినిమాలో హీరోయిన్గా నటించిన సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . వీళ్లు విడాకులు కూడా తీసుకునేసారు. ఇంత అన్యోన్యంగా ఉన్న జంట విడాకులు ఎందుకు తీసుకుంది అంటూ అక్కినేని అభిమానులు బుర్ర పీకున్నారు.

మీరైనా చెప్పండి రా బాబు అంటూ నానా విధాలుగా ట్రై చేశారు . అయితే అక్కినేని నాగచైతన్య సమంత ఏమాత్రం నోరు విప్పలేదు . అయితే రీసెంట్గా నాగచైతన్య సమంతపై పాజిటివ్ కామెంట్స్ చేశాడు . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా “మేము విడాకులు తీసుకుంది . సోషల్ మీడియా కారణంగానే అంటూ తేల్చేశాడు . అంతేకాదు మా విడాకులకు ప్రత్యక్ష పరోక్ష కారణం సోషల్ మీడియా అంటూ బల్ల గుద్ది చెప్పేసాడు .

ఈ క్రమంలోనే పనిలో పని సమంతను కూడా పొగిడేసాడు . “ఆమె చాలా మంచిదని .. ఆమె ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు నోరు విప్పని నాగచైతన్య ఇప్పుడే ఎందుకు సమంతను పొగిడేసాడు అన్న ప్రశ్న అందరికీ మెదలాడుతుంది . సినిమాల ప్రమోషన్ కోసమే సమంత గుర్తొస్తుందా ..? మిగతా టైం లో గుర్తు రాదా ..? విడాకులు తీసుకొని దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ..ఇన్నాళ్లు మీరు విడాకులు తీసుకోవడానికి కారణం ఇదే అని ఎందుకు చెప్పలేదు..? ఎందుకు కష్టపడి సినిమా ప్రమోషన్స్ టైం లోనే నోరు విప్పారు..? అని జనాలు సూటిగా ప్రశ్నిస్తున్నారు .

అంతేకాదు సమంతని పొగిడింది కేవలం సినిమా ప్రమోషన్స్ లో భాగమే అని ..సోషల్ మీడియాలో ఏ వార్తలొచ్చినా నమ్మేస్తారా ..? స్టార్ సెలబ్రిటీస్ అంటూ కూడా జనాలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య ఏదో ఎక్స్పెక్ట్ చేసి మరేదో విధంగా బుక్ అయిపోయాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు..!!

 

Share post:

Latest