ఆ సమయంలో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యా.. బెల్లంకొండ శ్రీనివాస్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఎక్కువగా మాస్ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తెలుగులో టైర్-2 హీరోగా పేరు సంపాదించారు. చివరిగా రాక్షసుడు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్ లో చత్రపతి సినిమాని రీమేక్ చేసి నటించారు. ఈ చిత్రాన్ని వివి వినాయక దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో పలు రకాల ప్రమోషన్స్లో పాల్గొనడం జరుగుతోంది.

Bollywood actors not interested in this film?

భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సందర్భంగా పలు రకాల ఇంటర్వ్యూలలో పాల్గొన్న బెల్లంకొండ శ్రీనివాస్ తాను ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ విషయాలను కూడా తెలియజేయడం జరిగింది.. బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిర్మాత కొడుకు కావడం వల్ల ఇండస్ట్రీలోకి ఎంట్రీ సులువు అయిందని తెలియజేశారు. అల్లుడు శ్రీను సినిమా తర్వాత ఫైనాన్షియల్ గా తన పరిస్థితి పూర్తిగా దెబ్బతినిందని తెలియజేశారు.

ఆ సమయంలో తన తండ్రి నిర్మాతగా చేసిన మూవీ పెద్దగా ఆడలేదు.. అలాగే డిస్ట్రిబ్యూటర్ గా చేసిన పలు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి దీంతో ఆర్థికంగా చాలానే నష్టపోయామని తెలిపారు. ఎలా బయటపడాలి అర్థం కాలేదని దీంతో చాలా మానసికంగా ఒత్తిడికి గురయ్యామని.. చేతి వరకు వచ్చిన మంచి అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు బెల్లంకొండ శ్రీనివాస్. బడ్జెట్లోనే సినిమాలను చేశానని తన కెరీర్లు జయ జానకి నాయక సినిమాని తనని నమ్మి బోయపాటి శ్రీను ఈ సినిమాను చేశారని తెలిపారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest