కేక పెట్టిస్తున్న యంగ్ బ్యూటీ శ్రీలీల.. మరో అరుదైన రికార్డ్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీ లీల ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్న కాకమొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో దగ్గర నుంచి అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా గ్లోబల్ హీరోగా మారిన హీరోస్ కూడా శ్రీ లీలనే తమ సినిమాలో హీరోయిన్గా కావాలి అంటూ మొండి చేస్తున్నారు . కోట్లకి కోట్లు ఇచ్చి తమ సినిమాల్లో కీలక రోల్ లో పెట్టుకుంటున్నారు . దినంతటికీ మెయిన్ రీజన్ ఆమె క్రేజ్.. అయితే మరో రీజన్ ఆమెకున్న అందమే కారణం అంటూ తెలుస్తుంది .

ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్స్ కూడా శ్రీలీల లక్ ని చూసి జలసిగా ఫీల్ అవుతున్నారు . కాగా ఇండస్ట్రీలోకి పెళ్లి సందడి అనే సినిమాతో శ్రీ లీల హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే . ఈ సినిమాకు అమ్ముడు 50 నుంచి 70 లక్షల పారితోషకం అందుకుందట. అయితే రెండో సినిమా ధమాకాకి ఏకంగా రెండు కోట్లు ఛార్జ్ చేసిందట . ప్రజెంట్ ఇప్పుడు తీసుకుంటున్న సినిమాలు అన్నిటికీ శ్రీ లీల 3-3.5 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం అందుతుంది .

అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఎస్.ఎస్.ఎన్.వి 28 సినిమా కోసం శ్రీ లీల ఏకంగా 3.5 కోట్లు పారితోషకం అందుకుంటుందట. అయితే ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా చేస్తున్న పూజ హెగ్డే కేవలం మూడు కోట్ల పారితోషకంగా తీసుకుంటూ ఉండడం అభిమానులకి షాకింగ్ గా ఉంది . శ్రీలీల కంటే పూజా హెగ్డే చాలా సీనియర్ ..చాలా హిట్లు కూడా పడ్డాయి . జనాలల్లో చాలా క్రేజ్ కూడా ఉంది.

అయినా సరే మేకర్స్ శ్రీలీల కే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తూ ఉండడం అభిమానులకు షాకింగ్ గా ఉంది. దీంతో శ్రీలీల అరుదైన రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నట్లయింది. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ హీరోయిన్ కన్నా సెకండ్ హీరోయిన్ ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న దాఖలాలే లేవు ..!

 

 

Share post:

Latest