ఆ స్టార్ క్రికెటర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక..

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గీతా గోవిందం, పుష్ప వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో హిట్ కావడంతో నార్త్ బెల్ట్‌లో కూడా ఈ తార ఫేమస్ అయ్యింది. అంతేకాదు తన చక్కనైన కళ్ళతో, హాట్ ఫిగర్ తో నేషనల్ క్రష్ గా మారింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలిపింది. అంతేకాదు తన ప్రియమైన క్రికెటర్‌పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది.

బెంగుళూరుకు చెందిన నటి రష్మిక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తనకు ఇష్టమైన టీమ్‌ని చెప్పింది. అలాగే విరాట్ కోహ్లీ అంటే తనకు అమితమైన ఇష్టం ఉంటుందని, ఈ సంవత్సరం కప్పు తమదే అని విశ్వాసం వ్యక్తం చేసింది. స్టార్ స్పోర్ట్స్ ట్వీట్ చేసిన వీడియోలో, ఐపిఎల్ సమయంలో RCB ఆటను చూడగలనని మందన్న తన ఆశను పంచుకుంది. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీపై ఆమె తన అభిమానాన్ని కూడా వ్యక్తం చేసింది, అతన్ని స్వాగర్, అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించింది.

రష్మిక ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో కలిసి బాలీవుడ్ చిత్రం ‘యానిమల్’ సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్‌లో, ఆమె నితిన్ సినిమాతో పాటు అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప 2ని చేస్తోంది. ఇక విరాట్ కోహ్లీకి సామాన్యులలోనే కాకుండా సెలబ్రిటీలలో కూడా అభిమానులు చాలామంది ఉన్నారు. ఆ జాబితాలో రష్మిక కూడా తాజాగా చేరిపోయింది. రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇక్కడ ఈ తారకు మూడు కోట్ల 80 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

ఇక ఈ క్యూట్ బ్యూటీ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను చెమటలు పట్టిస్తుంటుంది. ట్రెడిషనల్ డ్రెస్ లతోపాటు అల్ట్రా మోడల్ డ్రెస్సులలో కూడా ఈ బ్యూటీ అందాలను ఆరబోస్తుంటుంది. తొడ, ఎద అందాలను చూపిస్తూ మంటలు పుట్టిస్తుంటుంది.