విలక్షణమైన డైరెక్టర్ గా రచయితగా నటుడుగా పేరు పొందారు యాక్టర్ సముద్రఖని. అయితే ఈసారి ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం విమానం. ఈ చిత్రం లో అంగవైకల్యంతో బాధపడే వృద్ధ వయసుడిగా భార్య లేకపోయినా కొడుకుని అల్లారు ముద్దుగా పెంచే తండ్రి పాత్రలో సముద్రఖని నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కుమారుడు విమానం ఎక్కాలనే కోరిక చుట్టూ ఈ సినిమా సాగుతోందని ఇప్పటికే విడుదలైన అప్డేట్లను చూస్తే మనకి అర్థమవుతోంది.
విమానం సినిమాలో అనసూయ కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది.తాజాగా విమానం మూవీ మేకర్స్ మే డే సందర్భంగా యాంకర్ అనసూయ సంబంధించి ఒక పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో అనసూయ చీర ధరించి కనిపించి లోనెక్ బ్లౌజ్ నుండి అందాల ఆరబోతతో బాగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఒక కాలు పైకి పెట్టి మరి కూర్చున్నది.ఈ లుక్ నీ బట్టి విమానం సినిమాలో అనసూయ ఒక మాస్ పాత్రలో నటించబోతుందని అర్థమవుతోంది. విమానం సినిమా జూన్ 9వ తేదీన విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించారు.
రేపటి రోజున ఈ సినిమా నుంచి మొదటి పాటని విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ మీరా జాస్మిన్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మీరాజాస్మిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని ఇప్పటికే విడుదలైన ప్రోమో పోస్టర్లు చూపించడం జరిగింది. అత్యంత అద్వంతం బాగోద్వేగాల కలబోతగా సాగబోతోందని ఈ సినిమా మూవీ మేకర్స్ ఇదివరకే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అనసూయలు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నా యి.