సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే ఆర్కే రోజా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ ముద్దుగుమ్మకు టాలెంట్‌తో పాటు లక్ ఉండటం వల్ల దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ పట్టేసింది. అలానే ఎప్పుడూ కూడా ఖాళీగా లేకుండా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మారింది. తర్వాత బుల్లితెరపై జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో జడ్జిగా చేరింది. అందులో తన చిరునవ్వులతో అందరి హృదయాలను దోచేసింది. బుల్లితెరపై కొనసాగుతూనే రాజకీయాల్లో యాక్టివ్‌గా మారి ఆ రంగంలోనూ అంచెలంచెలుగా ఎదిగింది. వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచింది. ఈ మధ్యే మంత్రి పదవి కూడా ఆమెను వరించింది.
మరోవైపు అల్లరి నరేష్ కామెడీ, ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతమైన నటన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ తెలుగు వారికి దగ్గరయ్యాడు. నరేష్, రోజాకి మధ్య చాలా పరిచయం ఉందనే విషయం కొన్నేళ్ల వరకు ఎవరికీ తెలియలేదు. నరేష్ 2013లో జబర్దస్త్ వచ్చినప్పుడు రోజాను స్వాతి ముత్యపు జల్లులలో పాటకు ఎత్తుకొని తిప్పాడు. ఆ సమయంలో ఆమెను రెండుసార్లు ఎత్తుకొని తిప్పుతుంటే రోజా ఏమీ అనకుండా అతనికి కోపరేట్ చేసింది.
ఇక ‘నాంది’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా జబర్దస్త్ షోకి వచ్చిన నరేష్ రోజాతో మరోసారి కలిసి స్టెప్పులు వేశాడు. అనంతరం ఆమెను ఎత్తుకొని తిప్పాడు. ఈ సందర్భంగా రోజా తనకు నరేష్‌తో ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలియజేసే ప్రయత్నం చేసింది ఆమె మాట్లాడుతూ సీతారత్నం గారి అబ్బాయి సినిమా సమయంలో నరేష్ స్కూల్‌కి వెళ్లేవాడని… అప్పుడు తాను అతడిని ఎత్తుకొని ఆడుకునేదాన్ని చెప్పి ఆశ్చర్యపరిచింది. అప్పుడు నరేష్‌ని తాను ఎత్తుకొని ఆడుకుంటే.. ఇప్పుడు అతడు తనను ఎత్తుకొని ఆడుతున్నాడు అంటూ రోజా చెప్పింది.
ఇక సీతారత్నం గారి అబ్బాయి సినిమాని ఇ.ఇ.వి సత్యనారాయణ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే నరేష్‌ను రోజా ముద్దు చేసి అతడికి దగ్గర అయింది.