రూ. 37 కోట్ల టార్గెట్‌.. మూడు రోజుల్లో `ఏజెంట్‌` రాబ‌ట్టింది మ‌రీ అంత త‌క్కువా?

అక్కినేని అఖిల్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై హై బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ చిత్రంలో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు.

స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా.. తొలి ఆట నుంచే డిజాస్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోతోంది. మూడో రోజు సండే అయిన‌ప్ప‌టికీ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కేవ‌లం రూ. 43 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా రూ. 48 లక్షలు రాబ‌ట్టింది. ఇక ఏరియాల వారీగా ఏజెంట్ మూడు రోజుల టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 1.63 కోట్లు
సీడెడ్: 78 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 74 ల‌క్ష‌లు
తూర్పు: 41 ల‌క్ష‌లు
పశ్చిమ: 38 ల‌క్ష‌లు
గుంటూరు: 64 ల‌క్ష‌లు
కృష్ణ: 31 ల‌క్ష‌లు
నెల్లూరు: 21 ల‌క్ష‌లు
——————————————–
ఏపీ+తెలంగాణ‌= 5.10 కోట్లు(9.00 కోట్లు~ గ్రాస్‌)
——————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాప్ ఇండియా: 0.36 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 0.78 కోట్లు
———————————————–
టోటల్ వరల్డ్ వైడ్ = 6.24 కోట్లు(11.50 కోట్లు~ గ్రాస్)
———————————————–

కాగా, రూ. 37 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఏజెంట్.. బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ. 30.76 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. కానీ, ఫుల్ ర‌న్ లో ప‌ది కోట్లు రాబ‌ట్ట‌డం కూడా గ‌గ‌న‌మే అని అంటున్నారు.