పెళ్లి వ‌ద్దు కానీ.. అది కావాల‌ట‌.. స‌ల్మాన్ ఖాన్ కోరిక వింటే మైండ్‌బ్లాకే!

ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ పేరు మొద‌ట వినిపిస్తుంది. ఈయ‌న వ‌య‌సు 57. అయినాస‌రే పెళ్లి ఊసు మాత్రం ఎత్త‌డం లేదు. అయితే గ‌తంలో చాలా మందితో స‌ల్మాన్ ఖాన్ ప్రేమాయ‌ణం న‌డిపించాడు. కానీ, ఏ ఒక్క‌రితోనూ పెళ్లి పీట‌లెక్క‌లేదు.

అయితే ఒకప్పటి నటి జూహీ చావ్లాను మాత్రం స‌ల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాల‌ని భావించారు. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ పలు ఇంటర్వ్యూల్లో వెల్ల‌డించారు. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆమెతో విడిపోవాల్సి వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న స‌ల్మాన్ ఖాన్‌.. పెళ్లి వ‌ద్దు కానీ పిల్ల‌లు కావాలంటూ షాకింగ్ కోరిక‌ను బ‌య‌ట‌పెట్టి అంద‌రికీ మైండ్‌బ్లాక్ అయ్యేలా చేశాడు.

తనకి తండ్రి కావాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. తనకి పిల్లలు అంటే చాలా ఇష్టమని, పిల్లల్ని ఎక్కువుగా ప్రేమిస్తాను అంటూ వ్యాఖ్యానించాడు. ప్రేమ పెళ్లి త‌న‌ జీవితంలో ఉందో లేదో చెప్పలేనని.. అయితే పెళ్లి చేసుకోకుండానే పిల్లలకు తండ్రి కావాలని ఉందని త‌న కోరికను రివీల్ చేశారు. కరణ్ జోహార్ సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలను కన్నార‌ని, తను కూడా అలా పిల్ల‌ల‌ను పొందాలని కోరుకుంటున్నాను, కానీ ఇందుకు ఇండియ‌న్ చట్టాలు అంగీకరించవు అంటూ స‌ల్మాన్ పేర్కొన్నారు. దీంతో స‌ల్మాన్ ఖాన్ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest