పూజా హెగ్డే కెరీయర్ పతనానికి కారణం ఆ తెలుగు స్టార్ హీరోనేనా..? ఇద్దరి మధ్య అంత మ్యాటర్ నడిచిందా..?

టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే .. ప్రస్తుత కెరియర్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ డైరెక్టర్ అయిన అవకాశం ఇస్తాడా ..? లేదా..? అంటూ కాచుకుని స్థాయికి దిగజారిపోయింది పూజ హెగ్డే . ఎస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం .. పూజ హెగ్డే ఎవరైనా డైరెక్టర్స్ వచ్చి అవకాశం ఇవ్వకపోతారా..? అంటూ వెయిట్ చేస్తుందట. అంతలా తన కెరీయర్ని దిగజారి చేసుకునేసింది పూజ హెగ్డే .

మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అమ్మడు ఏ సినిమా పట్టుకున్న ఆ సినిమా ఫ్లాప్ అయిపోతుంది . ఇప్పటికే వరుసగా నలుగురు బడా హీరోలతో తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. హీరోయిన్గా పూజా ఉండడం వల్ల సినిమా ఫ్లాప్ అయిందో..? లేక కథ బాగోలేక సినిమా ఫ్లాప్ అయిందో తెలియదు.. కానీ ఫ్లాప్ అయినా భారం మొత్తం పూజ హెగ్డే పైన వేసేసారు జనాలు . ఈ క్రమంలోనే పూజ హెగ్డే ఖాతాలో ఇప్పుడు మహేష్ బాబు సినిమా తప్పిస్తే మరి ఏ సినిమా లేకుండా పోయింది . ఈ క్రమంలోనే పూజా హెగ్డే ఇంతలా తన కెరియర్ పతనం అవ్వడానికి కారణం టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ప్రభాస్ పూజ హెగ్డే జంటగా చేసిన సినిమా రాధే శ్యామ్ . భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయింది . ఈ సినిమాతో మరింత రేంజ్ లో ట్రోలింగ్కి కూడా గురి అయ్యారు ప్రభాస్. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడంతో భారం నెగెటివిటీ అంతా పూజ హెగ్డే పైన వేశారు . ఈ సినిమా షూటింగ్ టైంలో ప్రభాస్ – పూజ హెగ్డే లకు అస్సలు కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదని.. ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉన్నారని ..ముఖ్యంగా ఈగోల విషయంలో చాలా క్లాషె వచ్చాయని .. అయితే డైరెక్టర్ ఎలా గోల సర్ది చెప్పి సినిమాని షూట్ కంప్లీట్ చేశారని ..సినిమా ప్రమోషన్స్ టైం లో కూడా ఇద్దరు ఒకరితో ఒకరు ఫోటోలు దిగడానికి నానా హంగామా చేశారని న్యూస్ వైరల్ అయ్యాయి . కాగా ఈ క్రమంలోనే ప్రభాస్ తో గొడవలు కారణంగానే మిగతా హీరోలు అమ్మడుకు ఆఫర్లు ఇవ్వడం తగ్గించేసారని ..ఇచ్చిన ఆఫర్లు కూడా ఫ్లాప్ అవడంతో అమ్మడు కెరియర్ డౌన్ ఫాల్ అయిందని చెప్పుకొస్తున్నారు . ఇలా పరోక్షంగా తనకు తెలియకుండానే పూజ హెగ్డే కెరియర్ నాశనం అవ్వడానికి ప్రభాస్ కారణమయ్యాడు అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు..!!

 

Share post:

Latest