“ఆదిపురుష్” కోసం ప్రభాస్ అంత త్యాగం చేసాడా..? హ్యాట్సాఫ్ రెబల్ హీరో..!!

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ని దక్కించుకున్న విషయం తెలిసిందే. దీని అంతటికి కారణం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి అనే చెప్పాలి . ఆ సినిమా తర్వాత మిగతా నటుల పరిస్థితి ఎలా ఉన్నా హీరో ప్రభాస్ మాత్రం ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు . ఒక్కో సినిమాకి 100 నుంచి 150 కోట్లు పారితోషకం తీసుకుంటూ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడు .

ఆయన భారీ అంచనాలు పెట్టుకొని నటించిన సినిమా “ఆది పురుష్”. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం దాదాపు 2000 కోట్లు ఖర్చు చేశారు అన్న టాక్ కూడా బయటకి వినిపిస్తుంది . కాగా ఇలాంటి క్రమంలోనే భారీ తారగాణంతో తెరకెక్కుతున్న ” ఆది పురుష్” సినిమాకి ప్రమోషన్స్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు .

ఈ క్రమంలోని రీసెంట్గా రిలీజ్ అయిన శ్రీరామ్ సాంగ్ అభిమానులకి గూస్ బంప్స్ తెప్పిస్తుంది . అభిమానులను వేరే లోకానికి తీసుకెళ్లినట్టు గ్రాఫిక్స్ చాలా చక్కగా క్రియేట్ చేసాడు ఓం రావత్ అన్న పాజిటివ్ కామెంట్స్ దక్కించుకున్నాడు . ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ ఈ సినిమాకి సంబంధించిన పూర్తి సినిమా షూట్ కంప్లీట్ అయ్యేవరకు నాన్ వెజ్ తినలేదని..అలా పూర్తి గా వెజ్ భోజనం నే చేశారని ..అది ఆయనకు దేవుడిపై ఉన్న నమ్మకానికి అలా చేశారు అంటూ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే టెక్నాలజీ ఇంత పెరిగిపోయి.. కాలం ఎంత మారిపోయిన కూడా మన రెబల్ హీరో దేవుని నమ్ముతున్నారు అనడానికి ఇదొక నిదర్శనం . ఏది ఏమైనా సరే ప్రభాస్ లాంటి స్టార్ హీరో మన ఇండస్ట్రీ నుంచి మన ఇండస్ట్రీలో ఉండడం సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం అంటున్నారు ఆయన ఫ్యాన్స్..!!

Share post:

Latest