సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీలో రానా సతీమణిగా మెరిసిన ఈ ముద్దుగుమ్మ బింబిసారలో S.I వైజయంతిగా నటించి మెప్పించింది. ఆపై ధనుష్ సరసన సార్ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఆమె నటించిన ఈ మూడు సినిమాలు హ్యాట్రిక్ హిట్స్ కొట్టాయి. దాంతో ఆమెపై గోల్డెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. అవకాశాలు కూడా ఆమెకి క్యూ కడుతున్నాయి. రీసెంట్‌గా ఈ తార సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష మూవీలో కూడా నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దీంతో సంయుక్త మీనన్ పేరు టాలీవుడ్ లో మార్మోగింది.
ఈమె సక్సెస్ వెనుక మంచి స్క్రిప్ట్ ఎంచుకునే సామర్థ్యం ఒకటైతే ఆమె పాత్రలో లీనం కావడం మరొక కారణమని చెప్పవచ్చు. సంయుక్త వరుస సక్సెస్‌లు చూసి ఎప్పుడో ఒకసారి సక్సెస్ అందుకుంటున్న హీరోయిన్లు భయపడుతున్నారు. తమకు వచ్చే అవకాశాలు కూడా సంయుక్తానే ఎగరేసుకు పోతుందేమోనని వారికి గుబులు పట్టుకుందట. ఈరోజుల్లో హీరోయిన్లకు కూడా హిట్స్ రావడం లేదు. మీరు తట్టా బుట్టా సర్దుకొని ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి కూడా తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో సమిత లాంటి కొత్త హీరోయిన్లు రావడం వీరిని ఎవరూ పట్టించుకోకపోవడం జరుగుతోంది.
లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నా, నివేదా థామస్ వంటి హీరోయిన్లు అవకాశాలు లేక అల్లాడిపోతున్నారు. ఏదేమైనా కొత్త హీరోయిన్ల రాక, వారి వరుస సక్సెస్‌లు పాత హీరోయిన్ల కెరీర్ ముగింపుకి కారణమవుతున్నాయి.