క్రికెటర్ ప్రేమలో స్టార్ యాంకర్.. ఎవరంటే..?

టాలీవుడ్ లో యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచిమే బుల్లితెరపై యాంకర్ గా ఉన్నా ఒకపక్క యాంకర్ గా చేస్తే మరొక పక్క సోషల్ మీడియాలో తన అంద చందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. పలు చిత్రాలలో నటించే అవకాశం వచ్చిందంటే చాలు అది ఎలాంటి పాత్రలోనైనా సరే నటిస్తూ ఉంటుంది వర్షిణి.. అయితే గత కొద్దిరోజుల నుంచి ఈ ఆమ్మడి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే ఈమె క్రికెటర్ వాషింగ్టన్ సుందర్త ప్రేమాయణం నడుపుతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యన సన్రైజర్స్ టీమ్ కు ఆల్ రౌండర్ గా ఆడిన సుందర్ నాలుగు మ్యాచులు మాత్రమే ఆడారు.. గాయం వలన ఆడ లేకపోయిన సుందర్ ఈ మ్యాచ్ ఆడే సమయంలో జట్టు రూల్స్ బ్రేక్ చేసి..వర్షిణి తో బయట వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .అలా వెళ్లడం వలన టీమ్ ఇతడి పైన అసహనాన్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఈ మధ్యకాలంలో వర్షిణి ఎక్కువగా క్రికెట్ స్టేడియంలోనే కనిపిస్తోంది సన్రైజర్స్ టీ షర్టు వేసుకొని చీర ఆఫ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ నిజమేనంటూ కూడా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకవేళ ఈ విషయం నిజమే అయితే వర్షిణి దశ తిరిగినట్టే అంటూ అభిమానులు కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు. ఇక గతంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన మాటలను కొంతమంది నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.. ఆయన చేసిన కామెంట్లలో అనసూయ కన్నా వర్షిణి కె సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారని ఆమె రేంజ్ వేరని వారితో ఆమెను పోల్చుకోవడం కష్టమని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత భవిష్యత్తు ఉందని చెప్పుకొచ్చారు.. మరి సుందర్ తో ప్రేమాయణం పెళ్లి వరకు దారితీస్తుందో లేదో చూడాలి మరి.

Share post:

Latest