ఎన్టీఆర్ ఆ ఒక్క విషయంలో బాధపడుతున్నాడా..?

టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే…RRR చిత్రంతో గ్లోబల్ రేంజ్ లో పేరు సంపాదించిన ఎన్టీఆర్.. తన భార్య పిల్లలతో తల్లితో తన లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా తను సంపాదించిన డబ్బుతోనే ఈ లైఫ్ని బాగా లీడ్ చేస్తున్నారు ఎన్టీఆర్. దీనికి తోడు అభిమానులు చూపించే ప్రేమతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తన సినీ కెరియర్ లో ఎన్నో శిఖరాలను కూడా దాటుకున్నారు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్కు తన జీవితంలో తీరనిలోటు ఒకటున్నదట వాటి గురించి తెలుసుకుందాం.

Nandamuri Harikrishna – Jr NTR & Kalyanram

ఎన్టీఆర్కు తీరని లోటు ఉన్నది కేవలం తన తండ్రి ప్రేమే నట.. ఇప్పుడు ఇదే మాటలతో అప్పటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్ తన నాన్న హరికృష్ణ అంటే చాలా ప్రేమ భయం భక్తితో ఉండేవారు. ముఖ్యంగా తండ్రి అడుగుజాడల్లోనే నడిచేవారు ఇదే విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా తెలియజేశారు ఎన్టీఆర్ చాలా వేదికలో కూడా ఈ విషయాన్ని తెలిపారు. కానీ తాను అంత ప్రేమించే తండ్రి హఠాత్తుగా తనను విడిచి వెళ్లిపోవడంతో ఈ విషయాన్ని తట్టుకోలేక ఎన్టీఆర్ ఎన్నోసార్లు బాధపడ్డ రోజులు ఉన్నాయట.

ఆ తర్వాత సినిమాలలో బిజీ అయినప్పటికీ తన అభిమానులతో కలిసిన ప్రతిసారి పలు జాగ్రత్తలు తెలియజేస్తూ ఉంటారు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళమని సూచిస్తూ ఉంటారు.తన అభిమానులకు పేరుపేరునా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 వ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Share post:

Latest