మొదటిసారి తన ఆస్తి గురించి బయటపెట్టిన వీకే.నరేష్..!!

సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. తరచు పవిత్ర లోకేష్ తో ప్రేమాయణంతో వార్తలను నిలుస్తూ ఉన్నారు వి కె నరేష్. తాజాగా వీరిద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమాలో నటించారు. ఈ చిత్రాన్ని ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించగా ఈనెల 26వ తేదీన విడుదల కాబోతోంది ఇప్పటికి సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సాంగ్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది చిత్ర బృందం ప్రమోషన్స్ పనులను చాలా వేగవంతంగా చేస్తోంది.

Ramya Raghupathi, Ex-Wife of Actor V.K. Naresh, Embazzles Rs 40 Lakh; Case  Filed
ఇందులో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా నిర్వహించారు.. ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకోవడం జరిగింది వీకే నరేష్. ఇక మొదటి నుంచి నరేష్కు ఎక్కువగా ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది..అందుకే పవిత్ర అతని వెంట పడుతోంది అంటూ పలు రకాల రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. నరేష్ తన ఆస్తి విలువ గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది.. నరేష్ మాట్లాడుతూ అవును నేను బిలినియర్ ను.. రిచ్ పర్సన్ ను అందులో వారసత్వం వచ్చింది ఉంది.. నేను కష్టపడి సంపాదించింది ఉంది భూములు ధరలు పెరిగాయి. రూ.1000 కోట్లు కాదు అంతకుమించి ఉండవచ్చు నేనెప్పుడూ ఆ లెక్క చూసుకోలేదు ఏది ఏమైనా. ప్రశాంతంగా ఆ డబ్బంతా వైట్ అని చెప్పాను..

అంతా బ్లాక్ అనుకునేరు.. ఎక్కడ ఏది కావాలన్నా చూపిస్తాను. ఎంతో బాధ్యతగా నేను నా రాజ్యాన్ని స్థాపించుకున్నాను చాలా ఆస్తి మా అమ్మ గారి దగ్గర నుంచే వచ్చింది.. దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ 1,000 కోట్ల ఫిగర్ గురించి పక్కన పెడితే నేను నమ్మేది ఒకటే దేవుడు మనకు ఇచ్చింది ఒక జీవితం హ్యాపీగా ఉండాలి.. మనతోపాటు పదిమందిని హ్యాపీగా ఉంచాలి అని విధంగానే ఉన్నానని తెలిపారు.

Share post:

Latest