బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి .. ఫొటోస్ వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లెజెండ్రీ కమెడియన్ గా పేరు పొందారు నటుడు బ్రహ్మానందం. తాజాగా బ్రహ్మానందం ఇంట పెళ్లి భాజలు మోగుతున్నాయి. ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం వేడుకలు నిన్నటి రోజున చాలా ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది. డాక్టర్ పద్మజ వినయ్ కూతురు ఐశ్వర్యాలతో ఈ నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది..సిద్ధార్థ్ కాబోయే భార్య కూడా ఒక డాక్టరే.. ఈ వేడుకకు ఎంతోమంది సినీ నటులతో పాటు తదితరులు కూడా హాజరయ్యారు. ఈ వివాహాన్ని పెద్దలు కుదిరిచినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం వీరి నిశ్చితార్థ వేడుకలకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారుతున్నాయి.

ముఖ్యంగా బ్రహ్మానందం కు ఇద్దరు కుమారులు ఇందులో ఒకరు గౌతమ్ హీరోగా కొన్ని చిత్రాలు నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.దీంతో పెళ్లి చేసుకుని కుటుంబంతో చాలా ఆనందంగా ఉన్నారు.అయితే బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్ విదేశాలలో చదువుకొని అక్కడి ఉద్యోగం చేస్తూ ఉండడంతో అతని గురించి పెద్దగా ఎవరికి తెలియదు.. వాస్తవానికి సిద్ధార్థ్ కూడా హీరోగా ట్రై చేసేందుకు పలు పోలికలు ఉన్నప్పటికీ సినిమాల పైన పెద్దగా ఆసక్తిలేవకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్లు సమాచారం.

Brahmanandam ferocious in Rangamarthanda | cinejosh.com

ఇక బ్రహ్మానందం కుమారుడు సిద్ధార్థ్-ఐశ్వర్య త్వరలోనే వివాహ జరగబోతోంది. ఈ వివాహాన్ని బ్రహ్మానందం చాలా అంగరంగ వైభవంగా చేయబోతున్నట్లు తెలుస్తోంది.బ్రహ్మానందం సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో పెద్దగా నటించలేదు. చివరిగా రంగమార్తాండ సినిమాలో నటించారు. కొన్ని ఆరోగ్య కారణాలవల్ల ఎక్కువగా రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.బ్రహ్మానందం తెరపై కామెడీ పంచడంలోనే కాకుండా డ్రాయింగ్ లో కూడా సిద్ధహస్తుడు. ప్రస్తుతం బ్రహ్మానందం కొడుకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest